- Telugu News Photo Gallery Cinema photos Will chiranjeevi do next film with harish shankar after completing Vishwambhara
Chiranjeevi: స్పీడు పెంచిన మెగాస్టార్… హరీష్ కోసమేనా ??
ఊహించిన దానికంటే వేగంగా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు మెగాస్టార్. ఆయన స్పీడు చూసి యంగ్‌స్టర్స్ వామ్మో అనుకుంటుంటే, హరీష్ మాత్రం నాకోసమేనా అన్నయ్యా అంటూ మురిసిపోతున్నారు. విశ్వంభర షెడ్యూల్స్ స్పీడ్‌కీ, హరీష్ శంకర్ ఆనందానికీ లింకేంటి? కమాన్ లెట్స్ వాచ్. విశ్వంభర విషయంలో మొదటి నుంచి సూపర్ పాజిటివ్‌గా ఉన్నారు మెగాస్టార్. ఆ సినిమా అలా స్టార్ట్ అయ్యిందో లేదో వెంటనే పద్మవిభూషణ్ రావడం, ఆ సందడి నుంచి కాస్త సమయం చేసుకుని..
Updated on: Feb 15, 2024 | 4:15 PM

ఊహించిన దానికంటే వేగంగా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు మెగాస్టార్. ఆయన స్పీడు చూసి యంగ్‌స్టర్స్ వామ్మో అనుకుంటుంటే, హరీష్ మాత్రం నాకోసమేనా అన్నయ్యా అంటూ మురిసిపోతున్నారు. విశ్వంభర షెడ్యూల్స్ స్పీడ్‌కీ, హరీష్ శంకర్ ఆనందానికీ లింకేంటి? కమాన్ లెట్స్ వాచ్.

విశ్వంభర విషయంలో మొదటి నుంచి సూపర్ పాజిటివ్‌గా ఉన్నారు మెగాస్టార్. ఆ సినిమా అలా స్టార్ట్ అయ్యిందో లేదో వెంటనే పద్మవిభూషణ్ రావడం, ఆ సందడి నుంచి కాస్త సమయం చేసుకుని మరీ విశ్వంభరకు మెగాస్టార్ రెడీ కావడం వెంట వెంటనే జరిగిపోయాయి.

జిమ్ లుక్‌లో మెగాస్టార్‌ని చూసి ఫిదా అయిపోయారు మెగా తమ్ముళ్లు. బాస్ ఈజ్ బ్యాక్ విత్ డబుల్ ఎనర్జీ అంటూ సంబరాలు చేసుకున్నారు. వారి ఆనందానికి రెట్టింపు చేయడానికన్నట్టు మేకింగ్‌లో స్పీడ్ పెంచుతున్నారు కెప్టెన్ వశిష్ట. ఇప్పటికే విశ్వంభరకు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయన్నది లేటెస్ట్ న్యూస్. త్వరలోనే ఓ వేడుక కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్నారు చిరంజీవి. అక్కడ ఆయనకు ఘన సన్మానాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం.

విశ్వంభరలో తన పార్ట్ కంప్లీట్ కాగానే హరీష్ శంకర్ సెట్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు మెగాబాస్. చిరంజీవి ఫ్రీ అయ్యేలోపు, ప్రస్తుతం రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్‌ని త్వరగా కంప్లీట్ చేసేయాలని స్పీడు పెంచుతున్నారు హరీష్ శంకర్.

ఆల్రెడీ మెగా కాంపౌండ్‌లో తమ్ముడు పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు హరీష్ శంకర్. పవన్ పొలిటికల్ కమిట్‌మెంట్‌తో ఆ సినిమాకు కాస్త కామా పడింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ కమిట్‌మెంట్‌తో నయా సినిమాను షురూ చేయడానికి రెడీ అవుతున్నారు చిరంజీవి.




