- Telugu News Photo Gallery Cinema photos Mallika Sherawat shared that she missed out on many opportunities in the film industry
Mallika Sherawat: క్యాస్టింగ్ కౌచ్ కారణంగా చాలా సినిమాల్లో ఛాన్స్ లు కోల్పోయా : మల్లికా షెరావత్
మల్లికా షెరావత్ .. ఈ అమ్మడి అసలు పేరు రీమా లాంబా సినిమాల్లోకి వచ్చిన తర్వాత మల్లికా శెరావత్ గా మార్చుకుంది ఈ చిన్నది. "షెరావత్" అనేది ఆమె తల్లి పుట్టింటి వారి ఇంటి పేరు. తన తల్లి తనకిచ్చిన మద్దతు కారణంగా తల్లి పేరును ఉపయోగిస్తున్నానని ఆమె తెలిపింది.
Updated on: Feb 15, 2024 | 10:21 PM

మల్లికా షెరావత్ .. ఈ అమ్మడి అసలు పేరు రీమా లాంబా సినిమాల్లోకి వచ్చిన తర్వాత మల్లికా షెరావత్ గా మార్చుకుంది ఈ చిన్నది. "షెరావత్" అనేది ఆమె తల్లి పుట్టింటి వారి ఇంటి పేరు. తన తల్లి తనకిచ్చిన మద్దతు కారణంగా తల్లి పేరును ఉపయోగిస్తున్నానని ఆమె తెలిపింది.

ఎక్కువగా ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది. హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. 1997 లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే సమయంలో మల్లిక, డిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్‌ను వివాహం చేసుకుంది.

అయితే సినిమాల్లో ఛాన్స్ రావడంతో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఖ్వాహిష్ (2003), మర్డర్ (2004) వంటి సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యింది. కాస్టింగ్ కౌచ్ కారణంగా తన కెరీర్‌పై ప్రభావం చూపిందని తెలిపింది.

సినిమా హీరోతో కాంప్రమైజ్ అవ్వనందుకు తనకు సినిమా ఛాన్స్ లు రాకుండా చేశారని తెలిపింది. ‘హీరో రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి నా ఇంటికి రమ్మని పిలిచాడు. అలా వెళ్లలేదని తనకు సినిమా ఛాన్స్ లు రాకుండా చేశాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

మల్లికా నటించిన ‘మర్డర్’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయం తర్వాత, మల్లికా షెరావత్ చాలా చిత్రాలలో కనిపించింది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా సహాయక పాత్రలలో కనిపించింది. ఇప్పుడు సినిమాలు తగ్గించింది.




