Ratha Saptami: రథ సప్తమి రోజున నదీ స్నానం, జిల్లేడు ఆకులు, రేగు పండు, చిక్కుడుకాయల రథం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..

సూర్యుడి పుట్టిన రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. ఈ రోజు నుంచి ఉత్తరాభిముఖంగా సంపూర్ణమైన కాంతి కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి. కనుక రథ సప్తమి రోజున సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేస్తారు. సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేసి పూజను చేస్తారు. ప్రాముఖ్యత కలిగిన రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. ఆదిత్యుని ఆరాధిస్తే తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి

Ratha Saptami: రథ సప్తమి రోజున నదీ స్నానం, జిల్లేడు ఆకులు, రేగు పండు, చిక్కుడుకాయల రథం ప్రాముఖ్యత ఏమిటో తెలుసా..
Ratha Saptami 2024
Follow us

|

Updated on: Feb 15, 2024 | 5:03 PM

తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి అధిపతి. తిధుల్లో ఏడవ తిథి సప్తమి. సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి భాస్కరుడు యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి సూర్యుడి పుట్టిన రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. ఈ రోజు నుంచి ఉత్తరాభిముఖంగా సంపూర్ణమైన కాంతి కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి. కనుక రథ సప్తమి రోజున సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేస్తారు. సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేసి పూజను చేస్తారు.

నదీ స్నానం: జిల్లేడు ఆకులు, రేగు పండ్లు

ప్రాముఖ్యత కలిగిన రథ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ఈ పవిత్రమైన రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. ఆదిత్యుని ఆరాధిస్తే తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. సూర్యోదయానికంటే ముందే నది స్నానం చేయడం వలన సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగు పండ్లు తలమీద పెట్టుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది. సప్తమి సూర్యుడి జన్మ తిథి. రథ సప్తమి రోజున మాత్రమే కాదు ప్రతిశుద్ధ సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించి క్షీరాన్నాన్ని నివేదిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం.

పూజా విధానం:

సూర్యోదయాని కంటే ముందే స్నానం చేయాలి. అనంతరం ఆరుబయట తూర్పు దిక్కున దీపం పెట్టాలి. శక్తి కొద్దీ బంగారంతో కాని, వెండితో కాని రధాన్ని లేదా చిక్కుడు కాయలతో, కొబ్బరి పుచ్చులతో రథాన్ని తయారు చేసి దానికి ఏడు గుర్రాలను, సూతుడిని అమర్చాలి. అందులో సూర్య ప్రతిమను పెట్టాలి. పీఠం ఏర్పాటు చేసి కొత్త గుడ్డని పరిచి దాని మీద ఈ రధాన్ని ఉంచాలి. సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో పిడకల మంట ఏర్పాటు చేసి ఆవు పాలతో చెరకుతో పరమాన్నం తయారు చేసి ఆ క్షీరాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెట్టాలి.

ఇవి కూడా చదవండి

చదవాల్సిన శ్లోకం:

యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ

పురాణాల ఆధారంగా.. రథ సప్తమి సూర్యుడి జన్మదినం. ఈ రోజున అగస్త్యుడు శ్రీ రాముడికి బోధించిన మంత్రలైన ఆదిత్య హృదయం చదివినా విన్నా పుణ్యమని నమ్మకం. అంతేకాదు ఖగోళ పరంగా ఈ రోజుకు విశేష ప్రాముఖ్యత ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు