Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antarvedi: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణానికి సర్వం సిద్ధం.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

ఈనెల ఫిబ్రవరి 16 వ తేదీ నుండి 25 వరకు పది రోజులపాటు సంగమ క్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 16న స్వామి అమ్మవార్లను పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో చేయడంతో.. కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి 12.29 గంటలకు (తెల్లవారితే ఫిబ్రవరి 20) స్వామివారి కళ్యాణం.. ఆరుద్ర నక్షత్ర యుక్తమందు లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవంగా జరగనుంది. ఈ నెల 20 మధ్యాహ్నం స్వామి వారి రథోత్సవం, అనంతరం.. శ్రీవారి చక్రస్నానం నిర్వహించానున్నారు.

Antarvedi: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణానికి సర్వం సిద్ధం.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
Lakshmi Narasimha Swamy Temple
Follow us
Pvv Satyanarayana

| Edited By: Surya Kala

Updated on: Feb 15, 2024 | 5:30 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గోదావరి సాగర సంగమ క్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 19 వ తేదీ రాత్రి 12 గంటల 29 నిమిషాలకు మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి అశేష సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవానికి తరలిరానున్నారు. ఈ నేపధ్యంలో లక్ష్మీనరసింహస్వామి వార్షిక తిరు దివ్య కళ్యాణ మహోత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

16 వ తేదీ నుండి 25 వరకు స్వామివారి ఉత్సవాలు

ఈనెల ఫిబ్రవరి 16 వ తేదీ నుండి 25 వరకు పది రోజులపాటు స్వామివారి ఉత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 16న స్వామి అమ్మవార్లను పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో చేయడంతో.. కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 19వ తేదీ రాత్రి 12.29 గంటలకు (తెల్లవారితే ఫిబ్రవరి 20) స్వామివారి కళ్యాణం.. ఆరుద్ర నక్షత్ర యుక్తమందు లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవంగా జరగనుంది. ఈ నెల 20 మధ్యాహ్నం స్వామి వారి రథోత్సవం, అనంతరం.. శ్రీవారి చక్రస్నానం నిర్వహించానున్నారు. ఉత్సవాల్లో చివరి రోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు, ఆలయ ఈవో చెప్పారు.

నిఘా నీడలో కల్యాణ మహోత్సవాలు

పోలీసుల నిఘాలు కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి పోలీస్ వాచ్ టవర్ల ఏర్పాటు చేశారు. అంతేకాదు మైక్ సెట్లు, సముద్ర పరిసర ప్రాంతాలలో బ్యారికేడింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్వేదికి వచ్చే భక్తుల కోసం సుమారు వంద బస్సులకు పైగా అంతర్వేదికి వివిధ ప్రాంతాల నుండి నడపనున్నారు ఆర్టీసీ అధికారులు. దాదాపు డిఎస్పీలు, ఎస్సైలు సీఐలు కానిస్టేబుల్ సహా 1200 మందికి పైగా పోలీసులు అంతర్వేది కల్యాణంలో పాల్గొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తారన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరాజు.

ఇవి కూడా చదవండి

సముద్ర తీరానికి కూత వేట దూరంలో ఉన్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వేదం మంత్రాల నడుమ జరిగే స్వామివారి కళ్యాణం ఉత్సవాన్ని చూడడానికి ఉభయగోదావరి జిల్లాల నుంచే కాదు.. రాష్ట్రము నలుమూల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కళ్యాణం వేడుక ఒక ఘట్టమైతే మరో కీలక ఘట్టం రథసప్తమి రోజు నిర్వహించే రథోత్సవంలో వేల మంది పాల్గొంటారు. కన్నుల పండువగా సాగే రథోత్సవాన్ని చూడడానికి భారీగా భక్తులు హాజరవుతారు. అయితే 60 ఏండ్ల క్రితం టేకుతో 40 అడుగుల ఎత్తున్న రథం షెడ్డులో భద్రపరగా అది దగ్ధమైన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి రథోత్సవ సమయంలో కొత్త రథాన్ని చేయించింది. కోటి రూపాయల వ్యయంతో నూతన రథాన్ని నిర్మించి స్వామి కళ్యాణం అనంతరం జరిగే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రథం దగ్ధమైన తర్వాత జరుగుతున్న రెండో రథోత్సవం ఇది.

ప్రత్యేక శోభను సంతరించుకున్న ఆలయం

ఇప్పటికే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ కాంతులు ఆలయ గోపురాలకు కొత్త రంగులతో ప్రత్యేక శోభన సంతరించుకుంది. శతాబ్దాల క్రితం ఆలయాన్ని నిర్మించిన కోపనాతి కృష్ణమ్మ కుటుంబీకులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. మొగల్తూరు రాజులు స్వామి వారికి ఆభరణాల సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి అంతర్వేది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కళ్యాణం సందర్భంగా సముద్ర స్నానాలకు లక్షల మంది హాజరవుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..