AIIA: గుండె వ్యాధికి ఆపరేషన్ అని అల్లోపతి అంటే.. తక్కువ ఖర్చుతో నయం చేసేసింది ఆయుర్వేదం

నవంబర్ 2022లో గుండెపోటుకు గురైన ఢిల్లీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి అవధేష్ కుమార్ కు 95 శాతం హార్ట్ బ్లాకేజీగా గుర్తించారు వైద్యులు. ఆపరేషన్ తప్పని సరి అని చెప్పారు. అయితే ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయుర్వేద వైద్యం వైపు దృష్టి సారించాడు. ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వారిని ఆశ్రయించాడు. సెగ్మెంట్ 6లో నాన్-కాల్సిఫైడ్ ప్లేక్‌ని చూపించిన ఎడమ జఠరిక అవరోహణ ధమని చికిత్సని తీసుకున్నాడు. ఇప్పుడు అతని బ్లాక్స్ అన్ని క్లియర్ అయినట్లు గుండె మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకున్నట్లు నిర్ధారణ అయింది.

AIIA: గుండె వ్యాధికి ఆపరేషన్ అని అల్లోపతి అంటే.. తక్కువ ఖర్చుతో నయం చేసేసింది ఆయుర్వేదం
Ayurvedic Therapy
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2024 | 6:54 PM

ప్రపంచం అల్లోపతి వైద్యం అందుబాటులోకి రాక ముందే.. మన సుశ్రుడు, చరకుడు వైద్యం చేయడంలో దిట్ట అని చెబుతారు. ఆయుర్వేదం, హోమియో పతి వైద్యం ప్రకృతిలో ఒక భాగమని.. ఎటువంటి వ్యాధులనైనా నియమానుసారం చేస్తే ఫలితం దక్కుతుందని కొందరు చెబుతారు. ఆయుర్వేద, సిద్ధ వైద్యాన్ని మనం నిర్లక్ష్యం చేసినా చైనా, జపాన్ వంటి దేశాలు అక్కున చేర్చుకున్నాయి. ఆదరిస్తున్నాయి కూడా.. తాజాగా మన దేశంలో గుండె మళ్ళీ పని చేయాలంటే ఆపరేషన్ తప్పని సరి అని చెప్పిన వ్యక్తికీ ఆయుర్వేద వైద్యంతో నయం చేశారు.

నవంబర్ 2022లో గుండెపోటుకు గురైన ఢిల్లీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి అవధేష్ కుమార్ కు 95 శాతం హార్ట్ బ్లాకేజీగా గుర్తించారు వైద్యులు. ఆపరేషన్ తప్పని సరి అని చెప్పారు. అయితే ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయుర్వేద వైద్యం వైపు దృష్టి సారించాడు. ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వారిని ఆశ్రయించాడు. సెగ్మెంట్ 6లో నాన్-కాల్సిఫైడ్ ప్లేక్‌ని చూపించిన ఎడమ జఠరిక అవరోహణ ధమని చికిత్సని తీసుకున్నాడు. ఇప్పుడు అతని బ్లాక్స్ అన్ని క్లియర్ అయినట్లు గుండె మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకున్నట్లు నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళ్తే..

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) ప్రకారం.. 50 ఏళ్ల వ్యక్తి నాలుగు నెలల పాటు ఆయుర్వేద చికిత్స తీసుకుని గుండె సంబంధిత వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నాడు. నవంబర్ 2022లో గుండెపోటుకు గురైన ఆటోడ్రైవర్ కు ఎడమ జఠరిక అవరోహణ ధమని (LAD)లో 95 శాతం హార్ట్ బ్లాక్‌గా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో చికిత్స నిమిత్తం అతడిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఏడు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాడు. కొన్ని నెలల చికిత్స తర్వాత వైద్యులు యాంజియోగ్రఫీ చేసారు. దీనిలో ఎడమ పూర్వ అవరోహణలో 95 శాతం అడ్డంకులు, కుడి కరోనరీ ఆర్టరీలో 70% మధ్య బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

స్టెంటింగ్ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని వైద్యులు అవధేష్ కు చెప్పారు. అయితే ఆర్ధిక ఇబ్బందులతో ఆపరేషన్ చేయించుకోలేదు. బదులుగా ఆయుర్వేద చికిత్సను ఎంచుకున్నాడు. AIIA వారు చేసిన యాంజియోగ్రఫీలో అవధేష్ కు ఉన్న వ్యాధిని నిర్ధారించుకున్నారు.

దీంతో AIIAలో అవధేష్‌కి విరేచనకారి చికిత్సను సూచించారు. ఇది పంచకర్మ థెరపీ. ఇది అమా అనే టాక్సిన్స్‌ను తొలగిస్తూ.. శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది. అంతేకాదు అనారోగ్యానికి కారణమైన వాటిని తొలగించి శరీరం సమతుల్యం చేయడానికి, విషపూరిత మూలకాలను తొలగించడానికి ఉద్దేశించిన బయో-క్లెన్సింగ్ నియమావళిని అవధేష్ కు సూచించారు. ఆయుర్వేద వైద్యులు మూడు నెలలు పాటు మెడిసిన్స్ ను ఇచ్చారు. రెండు వారాల పాటు ఆసుపత్రిలో చేరి చికిత్సను తీసుకున్నాడు. ఇప్పుడు అతని LAD,  RCA రెండింటిలోనూ 0-5 శాతం అక్లూజన్‌ని కలిగి ఉన్నాడు. అంటే బ్లాక్స్ పూర్తిగా తొలగిపోయాయి.

అతను చికిత్స కోసం వచ్చినప్పుడు ఛాతీ నొప్పి , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో అవధేష్ సరిగ్గా నడవలేకపోయాడని AIIA వైద్యులు తెలిపారు.

LAD అడ్డంకిలో ఏమి జరుగుతుంది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం కొవ్వు LAD ధమని లోపల పేరుకుపోతుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ లేదా ధమనుల గట్టిపడటానికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫలకం మొత్తం ధమనిని పూర్తిగా అడ్డుకుంటుంది.  ఆక్సిజనేటెడ్ రక్తం ప్రవాహాన్ని ఆపివేస్తుంది. అప్పుడు ప్రాణాంతక గుండెపోటుకు దారితీస్తుంది. అలాగే కొంతమందికి సహజంగానే LAD ధమని ఉంటుంది. ఇది ఇరుకైన లేదా పొట్టిగా ఉంటుంది. ఇది హైపోప్లాస్టిక్ కి దారితీస్తుంది. ప్రమాదాన్ని పెంచుతుంది.

హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి మార్గాలు

హృదయ ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తినే ఆహారం తో పాటు అలవాట్లు కూడా ముఖ్యమే. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాన్ని తీసుకోండి. కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉండండి. ఆరోగ్యకరమైన బరువు ఉండే విధంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అధిక బరువుకు దూరంగా ఉండండి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి. తినే ఆహారంలో చక్కెర , ఉప్పు ని తగ్గించండి. తద్వారా మధుమేహం, రక్తపోటు స్థాయిలను నిర్వహించేలా  చర్యలు తీసుకోండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..