AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామయ్య భక్తులకు అలెర్ట్.. బాల రామయ్యకు రోజూ గంట పాటు విశ్రాంతి.. ఈ సమయంలో ఆలయం మూసివేత..

జనవరి 23వ తేదీ నుంచి తెల్లవారు జామున 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భక్తులను 'దర్శనానికి' అనుమతించడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.. ఇది రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది. అంటే ఉదయం 6.00 నుంచి రాత్రి 10.00 గం. వరకు రామ్ లల్లా దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక నుంచి ఒక గంట పాటు రామయ్య దర్శనం కోసం విరామం ఇవ్వనున్నారు. 

Ayodhya: రామయ్య భక్తులకు అలెర్ట్.. బాల రామయ్యకు రోజూ గంట పాటు విశ్రాంతి.. ఈ సమయంలో ఆలయం మూసివేత..
Ayodhya Ram Mandir
Surya Kala
|

Updated on: Feb 17, 2024 | 5:13 PM

Share

కొన్ని వందల ఏళ్ల కల తీరిన వేళ హిందువులు, రామ భక్తులు ఉత్తర  ప్రదేశ్ లోని అయోధ్యకు బారులు తీరుతున్నారు. బాల రామయ్యను దర్శించుకోవడానికి సెలబ్రెటీలు, సామాన్యులు క్యూలు కడుతున్నారు. దీంతో గర్భగుడిలో కొలువుదీరిన బాల రాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండంతో ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. దీంతో ఆలయ ట్రస్ట్ భక్తుల సౌకర్యార్థం ఆలయ దర్శన వేళలు పెంచింది. అయితే ఇప్పుడు ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయాన్ని ఇక నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు మూసివేస్తామని రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్‌ తెలిపారు. శుక్రవారం నుంచే దర్శనాన్ని ఒక గంట పాటు నిలివేశారు. ఇక నుంచి రోజూ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు. వాస్తవంగా సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెంచింది.

జనవరి 23వ తేదీ నుంచి తెల్లవారు జామున 4 గంటలకు స్వామివారి సుప్రభాత సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భక్తులను ‘దర్శనానికి’ అనుమతించడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.. ఇది రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుంది. అంటే ఉదయం 6.00 నుంచి రాత్రి 10.00 గం. వరకు రామ్ లల్లా దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక నుంచి ఒక గంట పాటు రామయ్య దర్శనం కోసం విరామం ఇవ్వనున్నారు.

“బాల రామయ్య ఐదేళ్ల పిల్లాడు. ఎక్కువ సమయం మెలకువగా ఉండటం వల్ల ఒత్తిడిని భరించలేడు. అందువల్ల బాల రామయ్యకు కొంత విశ్రాంతి ఇవ్వడానికి, ఆలయం తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. మధ్యాహ్నం 12:30 నుండి 1:30 వరకు రామయ్య విశ్రాంతి తీసుకోనున్నాడు ”అని ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గ్రాండ్ ఎంపరర్ హోటల్ కింద నిధి? కోట్ల విలువైన బంగారు ఇటుకలు..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
గుడ్‌న్యూస్‌.. మళ్లీ రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు..ఛార్జీలు
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
భారత్, పాక్ మ్యాచ్‌పై కొత్త ట్విస్ట్.. బంగ్లాదేశ్ ఎంట్రీతో..?
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
గోవా వెళ్తున్నారా..? ఇది చేస్తే 24 గంటల పాటు జైలుశిక్ష
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
సౌందర్య స్టార్ హీరోయిన్.. అయినా ఆ సీన్ కోసం అలా చేసింది..
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
టీ20 ప్రపంచకప్‌ను హీటెక్కించిన నేపాల్.. చివరి బంతి వరకు చుక్కలే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
ముక్క ముట్టని పెద్ద పులి.. కేవలం ద్రవాహారం మాత్రమే.. ఎందుకంటే
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం ఎందుకు చేస్తారో తెలుసా?
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
సీరియల్స్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదే..
'ధురంధర్' సినిమాకు అదే పెద్ద మైనస్.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
'ధురంధర్' సినిమాకు అదే పెద్ద మైనస్.. ఆమిర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్