టార్గెట్‌ 400.! హ్యాట్రిక్‌పై గురిపెట్టిన కమలనాథులు.. గెలుపు గుర్రాలే టార్గెట్‌గా వ్యూహం..

టార్గెట్‌- 400...! ఇప్పుడిదే కాషాయ పార్టీ ముందున్న లక్ష్యం..! హ్యాట్రిక్‌పై గురిపెట్టి.. టార్గెట్‌ 400 సీట్లుగా కసరత్తు చేస్తోంది బీజేపీ హైకమాండ్‌. ఈక్రమంలోనే.. ఇవాళ, రేపు ఢిల్లీ వేదికగా జరుగుతున్న బీజేపీ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పార్టీ విధానాలు..

టార్గెట్‌ 400.! హ్యాట్రిక్‌పై గురిపెట్టిన కమలనాథులు.. గెలుపు గుర్రాలే టార్గెట్‌గా వ్యూహం..
Bjp
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 17, 2024 | 5:00 PM

టార్గెట్‌- 400…! ఇప్పుడిదే కాషాయ పార్టీ ముందున్న లక్ష్యం..! హ్యాట్రిక్‌పై గురిపెట్టి.. టార్గెట్‌ 400 సీట్లుగా కసరత్తు చేస్తోంది బీజేపీ హైకమాండ్‌. ఈక్రమంలోనే.. ఇవాళ, రేపు ఢిల్లీ వేదికగా జరుగుతున్న బీజేపీ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పార్టీ విధానాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చతోపాటు పార్టీ అధ్యక్షుడు, ప్రధాని అభ్యర్థిని కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశంలో రేపు ప్రధాని మోదీ కేడర్‌కి ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఔర్‌ ఏక్‌ ధక్కా.. హ్యాట్రిక్‌ పక్కా ! అంటూ మరోసారి అధికారంపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. 2014 లో NDA కూటమికి 336 స్థానాలు దక్కించుకోగా.. బీజేపీ సొంతంగా 282 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. అదే 2019లో NDA కూటమికి 353 సీట్లు రాగా…అందులో బీజేపీ ఒంటరిగా 303 స్థానాలు సాధించింది. ఈ క్రమంలోనే సొంతంగా 370 స్థానాలు, మిత్రపక్షాలతో కలిసి 400పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. 2019 ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లను ఈసారి దక్కించుకోవాలని భావిస్తున్న కాషాయ పార్టీ..ఆ స్థానాలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేని నియోజకవర్గాల్లో.. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని..ఆ స్థానాలను కూడా బీజేపీ ఖాతాలో వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్‌గాంధీ నేతృ‌త్వంలోని కాంగ్రెస్ పార్టీ 1984లో 400కు పైగా స్థానాలను గెలిచి రికార్డ్ సృష్టించింది. అయితే.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే అధికారాన్ని ఏర్పాటు చేసేంత బలం కమలానికి ఉన్నా.. 400 ల సీట్ల మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమలోనే వచ్చే ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది బీజేపీ.

అయోధ్య రామాలయం నిర్మాణం ఈ ఎన్నికల్లో బీజేపీకి మరో అస్త్రం. ఇప్పటివరకూ ఒక ఎత్తు..ఇకపై మరో ఎత్తు అన్నట్లు ఉంది కమలం పార్టీ. అయోధ్యలో భవ్యమైన రామాలయం నిర్మాణం తర్వాత దేశంలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రధాని మోదీ సహా.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో కన్నా బీజేపీకి ఈ సారి 60 నుంచి 70 సీట్లు ఎక్కువ వస్తాయని ధీమాగా చెబుతున్నారు. దీనికి కారణం బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన రామాలయ నిర్మాణం హామీని నెరవేర్చడమే అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. 2004-14 మధ్య పదేళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆయన విరుచుకపడే అవకాశం ఉంది. అందుకే ఈ పదేళ్ల కాంగ్రెస్‌ పాలనపై పార్లమెంట్‌లో శ్వేతపత్రం విడుదల చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించే ఛాన్స్‌ ఉంది. అంతేకాదు కాంగ్రెస్‌ మళ్లీ వస్తే అనర్థాలు తప్పవని హెచ్చరిచకతోపాటు 2014-2024 బీజేపీ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కేడర్‌కి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. దాంతోపాటు వచ్చే ఐదేళ్లలో బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌ కూడా మోదీ వివరించే అవకాశం ఉంది. మొత్తానికి..బీజేపీ జాతీయ స్థాయి సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకావం ఉంది. దాంతో పాటు ఏపీలో పొత్తులపై కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌‌లోకి బజాజ్‌ స్కూటర్‌
ఆ ఈవీలకు గట్టిపోటీ తప్పదా..? మార్కెట్‌‌లోకి బజాజ్‌ స్కూటర్‌
అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై జానీ మాస్టర్ ఏమన్నాడంటే.? రియాక్షన్ ఇదే
పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్
పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్
పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువ‌తులు !!
పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువ‌తులు !!
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్
రాత్రి పడుకునేముందు ఇవి రాస్తే ఉదయానికే ఫేషియల్ లుక్..
రాత్రి పడుకునేముందు ఇవి రాస్తే ఉదయానికే ఫేషియల్ లుక్..
వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!
వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!
అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన చిక్కడపల్లి పోలీసులు
అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన చిక్కడపల్లి పోలీసులు
న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా.. ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్
వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్