Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఇంట్లో ఫ్రిడ్జ్ ను గోడకు దగ్గరలో పెడుతున్నారా.. ఇలా చేయడం వలన కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..!

ఫ్రిడ్జ్ ను గోడకు దగ్గరగా ఉంచినట్లయితే.. దీని వెనుక గాలి కదలికకు ఆటంకం ఏర్పడుతుంది. ఫ్రిడ్జ్ వాడుతున్న వినియోగదారులు కొన్నిసార్లు  అజాగ్రత్తగా ఉంటే అది భారీ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా సార్లు ఈ నష్టం వేల రూపాయల వరకు ఉంటుంది.   అయితే ఫ్రిడ్జ్ ను ఎక్కువగా గదిలోని గోడకు సమీపంలో ఏర్పాటు చేసుకుంటారు. రిఫ్రిజిరేటర్‌ను గోడ నుండి ఎంత దూరంలో ఉంచాలి అనే విషయంతో పాటు దీని వలన జరిగే నష్టం గురించి తెలుసుకుందాం.. 

Kitchen Hacks: ఇంట్లో ఫ్రిడ్జ్ ను గోడకు దగ్గరలో పెడుతున్నారా.. ఇలా చేయడం వలన కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..!
Kitchen Hacks
Follow us
Surya Kala

|

Updated on: Feb 17, 2024 | 6:22 PM

వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి చల్ల చల్లని నీరు తాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కొందరు కుండలో నీరుని తాగితే.. మరికొందరు చల్లని నీరు త్రాగడానికి, ఆహార పదార్ధాలు చెడిపోకుండా కాపాడుకోవడానికి  రిఫ్రిజిరేటర్ ను ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఫ్రిడ్జ్ సర్వసాధారణంగా మారింది. ఎక్కువగా  ఫ్రిడ్జ్ ను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. అయితే ఫ్రిడ్జ్ వాడుతున్న వినియోగదారులు కొన్నిసార్లు  అజాగ్రత్తగా ఉంటే అది భారీ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా సార్లు ఈ నష్టం వేల రూపాయల వరకు ఉంటుంది.   అయితే ఫ్రిడ్జ్ ను ఎక్కువగా గదిలోని గోడకు సమీపంలో ఏర్పాటు చేసుకుంటారు. రిఫ్రిజిరేటర్‌ను గోడ నుండి ఎంత దూరంలో ఉంచాలి అనే విషయంతో పాటు దీని వలన జరిగే నష్టం గురించి తెలుసుకుందాం..

రిఫ్రిజిరేటర్‌ను గోడకు దగ్గరగా ఉంచడం వల్ల కలిగే నష్టాలు

ఫ్రిడ్జ్ ను గోడకు దగ్గరగా ఉంచినట్లయితే.. దీని వెనుక గాలి కదలికకు ఆటంకం ఏర్పడుతుంది. ఫ్రిడ్జ్ కాయిల్ నుండి వెలువడే వేడి రివర్స్ అవుతుంది. దీని కారణంగా ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాదు ఫ్రిడ్జ్ సామర్థ్యం కంటే తక్కువగా చల్లబడుతుంది.

ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత పెరగడం వల్ల  కంప్రెసర్‌పై లోడ్ పెరుగుతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల ఉన్న సెన్సార్‌లు తగ్గిన శీతలీకరణ గురించి కంప్రెసర్‌కి సందేశాన్ని పంపుతాయి. శీతలీకరణను పెంచడానికి కంప్రెసర్ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. దీని కారణంగా రిఫ్రిజిరేటర్ కంప్రెసర్‌పై లోడ్ పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

రిఫ్రిజిరేటర్‌ను గోడకు దగ్గరగా ఉంచినట్లయితే దీని నుంచి వెలువడే వేడి గోడను దెబ్బతీస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి వచ్చే వేడికి గదిలోని పెయింట్ నల్లగా మారడం చాలాసార్లు చూసి ఉంటారు. కనుక ఫ్రిడ్జ్ ను గోడకు దగ్గరగా ఉంచినట్లయితే.. వెంటనే మధ్య అంతరాన్ని పెంచాలి.

ఫ్రిడ్జ్, గోడ మధ్య దూరం ఎంత ఉండాలంటే

రిఫ్రిజిరేటర్‌ను గోడకు దగ్గరగా ఉంచడం వల్ల కలిగే హానిని తెలుసుకుని.. దీని వల్ల కలిగే హానిని నివారించడానికి రిఫ్రిజిరేటర్, గోడ మధ్య దూరం ఎంత ఉండాలి అనే ప్రశ్న మీ మనస్సులో తలెత్తవచ్చు . టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రిఫ్రిజిరేటర్, గోడ మధ్య కనీసం 6 అంగుళాల దూరం నిర్వహించాలి. తద్వారా కాయిల్‌ను చల్లగా ఉంచడానికి ఫ్రిజ్‌కి తగినంత గాలి లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. దీనికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.