Kidney Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా.. డైట్‌లో ఇవి ఉండేలా చూసుకోండి!

శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మూత్ర పిండాలు కూడా ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని చేయడానికి అయినా మీకు వీలుంటుంది. ఒక్కసారి మీ కిడ్నీలు పాడైనా.. ఇన్ ఫెక్షన్ వంటివి సోకినా.. తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతూనే ఉంటారు. అంతగా కిడ్నీలు మీ శరీరంపై ప్రభావాని చూపిస్తాయి. మీరు తినే ఆహారంలోని వ్యర్థాలను బయటు పంపించే ముఖ్యమైన విధి కిడ్నీలే చేస్తాయి. అలాంటి మూత్ర పిండాలు ఒక్కసారి పాడైనా.. వచ్చే సమస్యలు చెప్పలేం. ఇక అస్తమానూ ఆస్పత్రుల చుట్టూ..

Kidney Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా.. డైట్‌లో ఇవి ఉండేలా చూసుకోండి!
Kidney Problems
Follow us
Chinni Enni

|

Updated on: Feb 17, 2024 | 5:44 PM

శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మూత్ర పిండాలు కూడా ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని చేయడానికి అయినా మీకు వీలుంటుంది. ఒక్కసారి మీ కిడ్నీలు పాడైనా.. ఇన్ ఫెక్షన్ వంటివి సోకినా.. తరచూ అనారోగ్య సమస్యల బారిన పడుతూనే ఉంటారు. అంతగా కిడ్నీలు మీ శరీరంపై ప్రభావాని చూపిస్తాయి. మీరు తినే ఆహారంలోని వ్యర్థాలను బయటు పంపించే ముఖ్యమైన విధి కిడ్నీలే చేస్తాయి. అలాంటి మూత్ర పిండాలు ఒక్కసారి పాడైనా.. వచ్చే సమస్యలు చెప్పలేం. ఇక అస్తమానూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. పలు రకాల ఇన్ ఫెక్షన్లు కూడా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వహించకండి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ రకమైన ఆహారాలను మీ డైట్‌లో ఉంచుకునేలా ప్లాన్ చేయండి. మీరు తినే ఆరోగ్యకరమైన ఆహారంతోనే సగం రోగాలు రాకుండా చూసుకోవచ్చు.

కీర దోసకాయ:

కీర దోసకాయలో నీటి శాతంతో పాటు ఇతర పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. కాబట్టి ఇది తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయ పడుతుంది. అందుకే ఇది కూడా మూత్ర పిండాలకు మేలు చేస్తుంది.

అల్లం:

అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే అల్లం కూడా తీసుకోవాలి. అల్లం టీ వంటివి తాగడం వల్ల మీ మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల సమస్యలను తగ్గించే గుణం అల్లంలో ఉంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నీరు:

కొబ్బరి నీరు శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. అలాగే డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. కిడ్నీ సమస్యలను తగ్గించడంలో కొబ్బరి నీరు కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి.

ఉసిరి:

ఉసిరి కాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఎర్ర క్యాప్సికమ్:

క్యాప్సికమ్‌లో ఎరుపు రంగు కూడా ఒకటి ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెడ్ క్యాప్సికమ్ కూడా కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీన్ని మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు. సలాడ్స్ వంటి వాటిల్లో యాడ్ చేసుకుని తినొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..