Silver Benefits: వెండి ప్లేట్‌లో ఆహారం తింటే ఎన్ని హెల్దీ బెనిఫిట్సో!
వెండి అనేది పంచ లోహాల్లో ఒకటి. ప్రస్తుతం వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండిని కొనడాన్ని ప్రస్టేజియస్‌గా భావిస్తున్నారు. పూర్వం ఎక్కువగా భోజనం చేయడానికి రాగి లేదా ఇత్తడి పాత్రలను ఉపయోగించే వారు. ఆ తర్వాత ఇప్పుడు అందరూ ఎక్కువగా స్టీల్ పాత్రలను యూజ్ చేస్తున్నారు. అయితే కాస్త ధనవంతుల ఇళ్లల్లో మాత్రం వెండి ప్లేట్లలో భోజనం చేస్తూ ఉంటారు. కానీ వెండి ప్లేట్లలో భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా మచింది. వెండి ప్లేట్‌లో..
వెండి అనేది పంచ లోహాల్లో ఒకటి. ప్రస్తుతం వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండిని కొనడాన్ని ప్రస్టేజియస్‌గా భావిస్తున్నారు. పూర్వం ఎక్కువగా భోజనం చేయడానికి రాగి లేదా ఇత్తడి పాత్రలను ఉపయోగించే వారు. ఆ తర్వాత ఇప్పుడు అందరూ ఎక్కువగా స్టీల్ పాత్రలను యూజ్ చేస్తున్నారు. అయితే కాస్త ధనవంతుల ఇళ్లల్లో మాత్రం వెండి ప్లేట్లలో భోజనం చేస్తూ ఉంటారు. కానీ వెండి ప్లేట్లలో భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా మచింది. వెండి ప్లేట్‌లో భోజనం తినడం వల్ల ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మీరు గమనించారంటే.. చిన్న పిల్లలకు అన్న ప్రాసన చేసేమయంలో ఖచ్చితంగా వెండి పాత్రలోనే కలిపి తినిపిస్తారు. అప్పుడు వచ్చే గిఫ్ట్స్ కూడా వెండివే ఇస్తారు. వెండి ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆహారం త్వరగా పాడవ్వదు:
ఇప్పుడంటే ఆహారాన్ని నిల్వ చేయడానికి ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. కానీ పూర్వం ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెండి పాత్రల్లోనే నిల్వ చేశారు. ఇందులో బ్యాక్టీరీయా అనేది అస్సలు పెరగదు. సూక్ష్మ జీవులు కూడా నశిస్తాయి. అందుకే వెండిలో ఆహారాన్ని నిల్వ చేస్తూ ఉంటారు. ఆహార పదార్థాలు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వెండి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగినా చాలా మంచిది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
వెండి ప్లేట్‌లో భోజనం తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎందుకంటే వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వెండి పళ్లెంలో ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఇన్ ఫెక్షన్లు వంటి సోకవు. వెండి శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అందుకే పెద్దలు మహిళల కాళ్లకు పట్టీలు, మెట్టెలు ఉంచుతారు.
వెండి తుప్పు పట్టదు:
ఇతర లోహాలతో పోల్చితే వెండి అనేది తుప్పు పట్టదు. ఇది ఆక్సిజన్‌తో కలవదు. అందుకే వెండి అస్సలు తుప్పు పట్టదు. సాధారణంగా లోహాలు ఆక్సిజన్‌తో కలిసి.. ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి. దీంతో విషపూరితం అవుతాయి. కానీ వెండి మాత్రం చాలా సురక్షితమైనది. అందుకే పలుచని వెండి పొరను.. ఆహార పదార్థాలపై ఉంచుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.