AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారీ కొండ చిలువల మధ్య ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి.. నెట్టింట్లో వీడియో వైరల్..

కొందరు ఇంటి పరిసరాల్లో కనిపించే పాములను భయం లేకుండా పట్టుకుని వాటిని సురక్షిత ప్రదేశంలో విడిచి పెడతారు. ప్రస్తుతం రకరకాల పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి పెద్ద పాముల పెట్టెలో నిర్భయంగా కూర్చున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోను జూ కీపర్ జే బ్రూవర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అతను కొన్ని పంక్తులతో వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు

Viral Video: భారీ కొండ చిలువల మధ్య ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి..  నెట్టింట్లో వీడియో వైరల్..
Snakes Vedio Viral
Surya Kala
|

Updated on: Feb 17, 2024 | 7:31 PM

Share

పాములంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. అవి విషపూరితమైనవి అయినా కాకపోయినా పాము కనిపిస్తే చాలు వీలైనంత దూరంగా పరిగెత్తుతారు. ఎంత ధైర్యవంతుడికైనా సరే ఒక్క క్షణం గుండె ఆగినట్లు ఫీల్ అవుతాడు. ముఖ్యంగా పాములంటే భయపడేవారు అంత సులభంగా బంధించిన పాముల దగ్గరికి కూడా వెళ్లరు. ధైర్యవంతులు మాత్రమే ఈ విష సర్పాలను పట్టుకునే సాహసం చేస్తారు. కొందరు ఇంటి పరిసరాల్లో కనిపించే పాములను భయం లేకుండా పట్టుకుని వాటిని సురక్షిత ప్రదేశంలో విడిచి పెడతారు. ప్రస్తుతం రకరకాల పాములకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ వ్యక్తి పెద్ద పాముల పెట్టెలో నిర్భయంగా కూర్చున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ వీడియోను జూ కీపర్ జే బ్రూవర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అతను కొన్ని పంక్తులతో వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు, “ఈ అద్భుతమైన రోజున నేను మీకు అన్ని పెద్ద పాములను చూపించాలని అనుకున్నాను. ఈ పాములన్నీ చిన్నప్పటి నుంచి పెంచుతున్నవే.. ఇప్పుడు మీరు కూడా చూడండి.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి

జే బ్రూవర్ ఈ వీడియోలో ఒక పెద్ద పెట్టె మధ్యలో కూర్చున్నట్లు చూడవచ్చు. అతని చుట్టూ పెద్ద పాములు ఉన్నాయి. ఈ పాములు అతని శరీరంపై పాకుతూ శరీరమంతా కప్పేస్తాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనికి 27.4 మిలియన్ల  వ్యూస్, వేలాది లైక్స్ వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భయాందోళనకు గురై రకరకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక వినియోగదారు “ఈ పాములు మిమ్మల్ని కరవవు అని తాను ఆశిస్తున్నాను” అని చెప్పగా మరొకరు “అద్భుతం! అవి మీపై దాడి చేయవు/.. మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాయి.” కామెంట్ చేయగా.. తనకు వచ్చే పీడకలలను మీరు చిత్రీకరించినట్లుగా ఉంది.. నాకు పాములంటే చాలా భయం అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!