AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క.. అందుబాటులో 6 వేల ప్రత్యేక బస్సులు 

భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు.  దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది జాతర కోసం పని చేస్తున్నారని.. సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం  మేడారం జాతరకు అమల్లో ఉందని.. మహిళలు పైసా ఖర్చు లేకుండా సమ్మక్క, సారలమ్మని దర్శించుకోవచ్చని చెప్పారు మంత్రి సీతక్క

Medaram Jatara: మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క.. అందుబాటులో 6 వేల ప్రత్యేక బస్సులు 
Medaram Jatara
Surya Kala
|

Updated on: Feb 17, 2024 | 8:44 PM

Share

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అంతేకాదు భక్తుల కోసం ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంపును మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆదివారం నుంచి 25వ తేది వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకుని తిరిగి గమ్యస్థానానికి చేరుకునే భక్తులు క్షేమంగా తమ తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు.

55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్  నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని చెప్పారు. జాతర 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ తో కూడిన బేస్ క్యాంపును ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాదు బేస్ క్యాంప్ లో 7 కిలో మీటర్ల పొడవునా 50 క్యూ లైన్లను నిర్మించినట్లు వివరించారు.

6 వేల ప్రత్యేక బస్సులు

భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు.  దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది జాతర కోసం పని చేస్తున్నారని.. సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఉచిత బస్సు సౌకర్యం

రాష్ట్రంలో అమల్లో ఉన్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం  మేడారం జాతరకు అమల్లో ఉందని.. మహిళలు పైసా ఖర్చు లేకుండా సమ్మక్క, సారలమ్మని దర్శించుకోవచ్చని చెప్పారు మంత్రి సీతక్క. అయితే జాతరకు బస్సుల్లో వచ్చే ప్రయాణీకులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తెలెత్తకుండా ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు నిబద్దత, క్రమ శిక్షణతో పని చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి సీతక్క.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
హార్దిక్ కోసం 12 రోజుల సైకిల్ ప్రయాణం.. పాండ్యా రియాక్షన్ చూశారా?
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
మీ టైమ్ వచ్చేసింది భయ్యా..! ఈ రాశుల వారికి బాబా వంగా గుడ్‌న్యూస్
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!