Hyderabad: ఉచిత కరెంట్ పొందాలంటే ఇవి తప్పనిసరి.. కీలక ప్రకటన.! పూర్తి వివరాలు..

గృహజ్యోతి లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ విద్యుత్ శాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ వ్యాలిడేషన్ పూర్తి చేస్తేనే ఉచిత కరెంట్ పథకంలో పేర్లు నమోదవుతాయని తెలిపింది.

Hyderabad: ఉచిత కరెంట్ పొందాలంటే ఇవి తప్పనిసరి.. కీలక ప్రకటన.! పూర్తి వివరాలు..
Free Current Scheme
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 17, 2024 | 8:30 PM

గృహజ్యోతి లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ విద్యుత్ శాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. బయోమెట్రిక్ విధానంలో ఈ వ్యాలిడేషన్ పూర్తి చేస్తేనే ఉచిత కరెంట్ పథకంలో పేర్లు నమోదవుతాయని తెలిపింది. ఆధార్ వేరిఫికేషన్ ప్రాసెస్‌లో డిస్కంలు చేపట్టాలని విద్యుత్ శాఖ తన ప్రకటనలో ఆదేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్‌ను సిబ్బందికి తెలపాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే వెంటనే తీసుకుని.. ఆ తక్షణం దరఖాస్తు చేసుకుని, ఆ ప్రూఫ్ చూపించాలి. అయితే ఆధార్ జారీ అయ్యేవరకూ ఇతర గుర్తింపు కార్డులను వినియోగించవచ్చు. బ్యాంకు, పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఎవరైనా గెజిటెడ్ అధికారి, ఎమ్మార్వో ఇచ్చిన ధ్రువీకరణ పత్రం వంటి వాటిల్లో ఏదైనా విద్యుత్ సిబ్బందికి చూపి పేర్లు నమోదు చేసుకోవాలి.

బయోమెట్రిక్ వ్యాలీడెషన్ లో భాగంగా వేలిముద్ర లేకుంటే కనురెప్పలను స్కాన్ చేయాలని విద్యుత్ శాఖ తన ఆదేశాల్లో తెలిపింది. డిస్కంలే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబర్‌ను నమోదు చేయగానే దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని చెప్పింది. అది కాకపోతే, ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలను విద్యుత్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తొందరలోనే వెలువడే అవకాశం ఉంది.