KCR New Car: కొత్త కారులో తిరుగుతున్న కారు పార్టీ అధినేత కేసీఆర్.. స్సెషాలిటీ ఏంటో తెలుసా..?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ గుర్తు కారు. నిజానికి కేసీఆర్‌కు కారు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కూడా. ఉద్యమ సమయంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కారు ర్యాలీ నిర్వహించారు. అప్పుడు ఢిల్లీ వరకు ఆ ర్యాలీని ముందు వరుసలో ఉంచి స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ ఢిల్లీ చేరుకున్నారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లో కారు డ్రైవ్ చేసేవారు కేసీఆర్.

KCR New Car: కొత్త కారులో తిరుగుతున్న కారు పార్టీ అధినేత కేసీఆర్.. స్సెషాలిటీ ఏంటో తెలుసా..?
Kcr New Car
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 17, 2024 | 7:04 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ గుర్తు కారు. నిజానికి కేసీఆర్‌కు కారు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కూడా. ఉద్యమ సమయంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కారు ర్యాలీ నిర్వహించారు. అప్పుడు ఢిల్లీ వరకు ఆ ర్యాలీని ముందు వరుసలో ఉంచి స్వయంగా కారును డ్రైవ్ చేస్తూ ఢిల్లీ చేరుకున్నారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అప్పుడప్పుడు ఫామ్ హౌస్ లో కారు డ్రైవ్ చేసేవారు కేసీఆర్. గతంలో ఒకసారి ఎలక్ట్రిక్ కారు కొని అప్పుడప్పుడు నడుపుతున్నట్లు ప్రెస్ మీట్ లో కూడా స్వయంగా చెప్పారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం ఇచ్చే కాన్వాయ్‌లో ప్రయాణం చేసే కేసీఆర్, ఇప్పుడు ఓటమి తర్వాత కొత్త కారు కొనుక్కున్నారు. గతంలోలా ఇప్పుడు సరదా కోసమో డ్రైవ్ చేయడానికి ఆయన కారు కొనలేదు. కొద్దిరోజులు క్రితం తొంటి ఎముక విరగడంతో ఆయన ఇన్నోవా, ఫార్చునర్ లాంటి పెద్ద వాహనాల్లో ఎక్కి కూర్చోలేకపోతున్నారు. కాలు నొప్పి వల్ల దిగడం ఎక్కడం ఆయన వల్ల కావడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రత్యామ్నయ కారు కొనాలనుకున్నారు. దీంతో సీటింగ్ కిందకు ఉండే సెడాన్ కార్ అయితే బెటర్ అని కుటుంబం భావించింది.

ఇందుకోసం కేసీఆర్‌కు ప్రత్యేకంగా బెంజ్ కంపెనీకి చెందిన కారుని కొనుగోలు చేశారు. బెంజ్ సెడాన్ మొదలైన మేబాజ్ కారును ఆయన కోసం ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఎక్కడ దిగడం సులువుగా ఉండడంతో పాటు సురక్షితంగా ఉండేలా ఈ కారును ఎంచుకున్నారు. కేసీఆర్‌కు ఇష్టమైన తెలుపు రంగుతోపాటు… ఆయనకు లక్కీ నెంబర్ అయినా 6666 ను కూడా తీసుకునున్నారు. సడన్ కార్ కావడంతో ఇంతకు ముందులా ఆయన కారులో భద్రతా సిబ్బంది ప్రయాణించే అవకాశం లేదు. ఆయనతోపాటు ఒక వ్యక్తిగత సహాయకుడు మాత్రమే ఆయన కారులో ఉంటారు. భద్రతా సిబ్బంది కోసం మరో వాహనాన్ని ఉంచారు.

అయితే భారత రాష్ట్ర సమితి సింబల్ అయిన కారు గుర్తును ఈ కొత్త కారు పోలి ఉండడం పార్టీలో చర్చగా మారింది. ఇకపై కాలు నొప్పితో బాధపడుతున్న కేసీఆర్ ఇదే కారులో ప్రయాణించనున్నారు. కారు సీటు కిందకు ఉండడంతో పాటు, సౌకర్యవంతంగా కుదుపులు వచ్చిన తట్టుకునేలా టెక్నాలజీ ఉండడంతో ఈ బెంజ్ మెబాజ్ మోడల్‌ను తీర్చిదిద్దారు. తన ప్రయాణానికి అనుకూలంగా ఉండటంతో ఈ బెంజ్ కారును ఇష్టపడ్డారు కెసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..