AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కొత్తరకం పార్ట్‌ టైమ్‌ జాబ్‌ మోసం.. నగ్నంగా వీడియా కాల్స్‌ మాట్లాడించి, ఆపై..

ముఖ్యంగా సైబర్‌ క్రిమినల్స్‌ అమాయకులను టార్గెట్ చేసుకొని పార్ట్ టైమ్‌ పేరుతో లింక్‌లు పంపిస్తూ డబ్బులు కాజేస్తుంటారు. ఇలాంటి కేసులు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి. మోసగాళ్ల మాయలో పడిపోయి రూ. లక్షల్లో కోల్పోయిన సంఘటనలు ఎన్నో తాజాగా వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా మరో రకం కొత్త మోసం..

Hyderabad: కొత్తరకం పార్ట్‌ టైమ్‌ జాబ్‌ మోసం.. నగ్నంగా వీడియా కాల్స్‌ మాట్లాడించి, ఆపై..
Fake Part Time Jobs
Narender Vaitla
|

Updated on: Feb 18, 2024 | 7:18 AM

Share

ఇటీవల పార్ట్‌ టైమ్‌ జాబ్‌ పేరుతో మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. మనిషి అత్యశను, అవసరాన్ని క్యాష్‌ చేసుకునేందుకు కేటుగాళ్లు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. పార్ట్‌ టైమ్ ఉద్యోగాల పేరుతో బురిడి కొట్టిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పార్ట్‌ టైమ్‌ జాబ్‌ పేరుతో డబ్బులు కాజేసిన కేటుటాళ్లను చూశాం.

ముఖ్యంగా సైబర్‌ క్రిమినల్స్‌ అమాయకులను టార్గెట్ చేసుకొని పార్ట్ టైమ్‌ పేరుతో లింక్‌లు పంపిస్తూ డబ్బులు కాజేస్తుంటారు. ఇలాంటి కేసులు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి. మోసగాళ్ల మాయలో పడిపోయి రూ. లక్షల్లో కోల్పోయిన సంఘటనలు ఎన్నో తాజాగా వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా మరో రకం కొత్త మోసం బయటపడింది. పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ ప్రబుద్ధుడు మహిళలను వంచించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెంకు చెందిన విజయ్‌ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ ఐడీలను క్రియేట్ చేసి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని స్టేటస్‌లో ప్రచారం చేశాడు. ఒకవేళ ఎవరైనా ఆసక్తి చూపించి సంప్రదించారో ఇక వారితో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత వారిని నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడేలా చేస్తాడు. దీంతో వారితో కాల్స్‌ మాట్లాడే సమయంలో వీడియోలను, ఫొటోలను సీక్రెట్‌గా సేకరిస్తాడు.

ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలు పెడ్తాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తాడు. ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తానని భయపెడతాడు. తాజాగా హైదరాబాదర్‌కు చెందిన ఓ యువతి ఇలాగే విజయ్‌ మాయలో పడింది. డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తాను అనగానే, సదరు యువతి సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ సైదులు బృందం నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించింది.

అందుకే పార్ట్ టైమ్ జాబ్ పేరుతో ఆన్ లైన్ లో వచ్చిన సమాచారన్నంతా నమ్మకూడదని పోలీసులు చెబుతున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలియని వ్యక్తులతో వీడియో కాల్స్, ఆడియా కాల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇక పార్ట్ టైమ్ జాబ్ లో ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది కచ్చితంగా ఫేక్ అనే నిర్ధారణకు రావాలని సూచిస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..