Telangana: హరీష్ రిక్వెస్ట్‌లు.. సీఎం రేవంత్ సెటైర్లు.. సభ ముగిసినా జల యుద్ధానికి నో ఫుల్ స్టాప్..
సభ ముగిసింది. అయినా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కేఆర్‌ఎంబీతో మొదలైన ఫైట్...ఇరిగేషన్‌పై వైట్ పేపర్‌తో బిగ్ ఫైట్‌గా మారింది. శ్వేతపత్రంపై అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ డిబేట్ నడిచింది. ఆ సెగలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసినా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య పంచ్‌లు, కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.
హాట్‌హాట్‌గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. కేఆర్‌ఎంబీతో స్టార్ట్ అయిన రాజకీయ రగడ ఇరిగేషన్‌పై వైట్ పేపర్‌తో బిగ్ ఫైట్‌కు దారి తీసింది. చివరకు నిరవధికంగా వాయిదా పడి సభ ముగిసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు పలు తీర్మానాలు చేశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత, సాగు నీటి రంగంపై శ్వేత పత్రం విడుదలపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఇక మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగడం, వాటర్ లీక్ అంశం…సభలో వేడి పుట్టించింది. దీనిపై సవాళ్ళు ప్రతి సవాళ్ళతో సభ దద్దరిల్లింది. చివరిరోజు.. ఆదివారం.. తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్‌పై వాడీవేడి చర్చ జరిగింది. శ్వేతపత్రంపై అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ డిబేట్ నడిచింది. ఇంత సీరియస్ డిస్కషన్‌లోనూ సభ్యులు చమత్కరాలు, సెటైర్లతో సభలో నవ్వులు పూయించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్‌పై శ్వేత పత్రం ప్రవేశపెట్టడం.. దానిపై చర్చ కూడా జరిగింది. అధికార పక్షానికి దీటైన సమాధానాలు చెబుతూ.. ప్రతిపక్ష తరఫున తన గళాన్ని వినిపించారు హరీష్ రావు. మధ్యలో స్పీకర్‌కు హరీష్ రావు ఆసక్తికర రిక్వెస్ట్ చేశారు. సభలో మాట్లాడుతుండగా తమ ముఖాలు కూడా కెమెరాకు చూపించాలనడంతో సభ్యులు ఘొల్లున నవ్వారు. గత కాంగ్రెస్ పాలనలో కవులు రాసిన పాటల్ని కూడా చదివి వినిపించారు హరీష్ రావు.. మేడిగడ్డ మేడిపండేనా అన్న కథనాలను ప్రస్తావించిన సీఎం రేవంత్.. కేసీఆర్‌పైనా చలోక్తులు విసిరారు. హరీష్ రిక్వెస్ట్‌లు.. సీఎం సెటైర్లు.. సభలో నవ్వులు పూయించాయి. ఈ కామెంట్లు సోషల్ మీడియాలోనూ కూడా వైరల్ అయ్యాయి. వీడియోలపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. మధ్యమధ్యలో కూల్‌గా.. టోటల్‌గా హాట్‌గా సాగింది చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ.
తెలంగాణ శాసనసభ 8 రోజుల పాటు 45 గంటల 32 నిమిషాల సేపు జరిగింది. 2 తీర్మానాలను సభ పాస్ చేసింది. 3 బిల్లులకు ఆమోదం తెలపగా ఒక షార్ట్ డిస్కషన్ జరిగింది. పార్టీలవారీగా అధికార కాంగ్రెస్, 8 గంటల 43 నిమిషాలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్..8 గంటల 41 నిమిషాలు, బీజేపీ సభ్యులు, 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎం నేతలు 5 గంటల పాటు సభలో మాట్లాడారు. ఇక సీపీఐకి ఉన్న ఒకే ఒక సభ్యుడు 2 గంటల 55 నిమిషాల పాటు మాట్లాడారు. ఇక శాసన మండలి 11 గంటల 5 నిమిషాల పాటు జరిగింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు జరిగిన నష్టం ఆషామాషీది కాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాత్కాలిక మరమ్మతులు పనికి రావన్నారు ఆయన. దీనిపై ముందుకు వెళ్లేందుకు విధానపరమైన నిర్ణయం కోసం NSDAకి ఆ మూడు ప్రాజెక్టులు అప్పగిస్తామని సభలో ఉత్తమ్ ప్రకటించారు.
అయితే ప్రాజెక్టులపై తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు బీఆర్ఎస్ నేత హరీష్. కాగ్ బైబిల్ కాదు, భగవద్గీత కాదని కాంగ్రెస్సే గతంలో చెప్పిందన్నారు ఆయన. గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ ఆరోపించారు.
సభలో వాడీవేడిగా జరిగిన జలయుద్ధం, సభ ముగిశాక కూడా మాటల తూటాలు పేలుస్తోంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..