Telangana: ఈ నియోజకవర్గంలో పోటీకి ముందుకు రాని నేతలు.. టికెట్ అయనకేనా..?

అసలే కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ ఛీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న నియోజకవర్గం అది. గులాబీ పార్టీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్‎లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు. సిట్టింగ్ అభ్యర్థి బలహీనంగా కనిపించడంతో గట్టి అభ్యర్థినే నిలబెట్టాలనే సంకల్పంతో ఉంది అధిష్టానం. ఎంత మందిని సంప్రదించినా అందరూ పక్కకు తప్పుకుంటున్నారు.

Telangana: ఈ నియోజకవర్గంలో పోటీకి ముందుకు రాని నేతలు.. టికెట్ అయనకేనా..?
Congress Party
Follow us
Boorugu Shiva Kumar

| Edited By: Srikar T

Updated on: Feb 18, 2024 | 8:30 AM

అసలే కాంగ్రెస్ పార్టీ తరఫున పీసీసీ ఛీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న నియోజకవర్గం అది. గులాబీ పార్టీ ఆ పార్లమెంట్ సెగ్మెంట్‎లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు. సిట్టింగ్ అభ్యర్థి బలహీనంగా కనిపించడంతో గట్టి అభ్యర్థినే నిలబెట్టాలనే సంకల్పంతో ఉంది అధిష్టానం. ఎంత మందిని సంప్రదించినా అందరూ పక్కకు తప్పుకుంటున్నారు. చివరికి ఆ నేత మెడకే పార్లమెంట్ అభ్యర్థిగా దండేయనున్నట్లు చర్చలు నడుస్తున్నాయి.

పాలమూరు పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఓ పక్క కాంగ్రెస్, బీజేపీలో నేనంటే నేను అంటూ ఎంపీ టికెట్ కోసం నేతలు క్యూ కడుతుంటే.. నిన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‎లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయానికి ఎంపీ ఎన్నికల్లో పోటీకి నేతలేవరూ ముందుకు రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సవాల్‎గా తీసుకుంది. అందులో భాగంగా ఎంపీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థలతో బరిలో దిగాలని భావిస్తోంది.

ముఖ్యంగా మహబూబ్‎నగర్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వారికి ధీటుగా అభ్యర్థిని దింపాలనుకుంటున్నారు. సిట్టింగ్‎ను కాదనీ బలమైన నేతనే పోటీ చేయించాలని గులాబీ అధిష్టానం చూస్తోంది. ఇప్పటికే అభ్యర్థి కోసం విరివిగా సంప్రదింపులు సైతం జరిపిందట. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్పఓట్ల తేడాతో ఓడిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, నారాయణపేట మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డిలలో చర్చలు జరిపినట్లు తెలిసింది. వీరందరూ పోటీకి దూరంగా ఉంటామనే ఆలోచననే అధిష్టానానికి వినిపించారట.

ఇవి కూడా చదవండి

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ:

అయితే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీచేసి గెలవడం అంత సులవైన పని కాదని గులాబీ నేతలు ఆలోచనల్లో పడ్డారట. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇంఛార్జ్‎గా ఉండడంతో పాటు ఆయన అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ సైతం ఈ పార్లమెంట్ పరిధిలోని ఉంది. దీంతో పాటుగా బీజేపీ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలకు ఉన్న పాజిటివ్ టాక్ గులాబీ పార్టీకి లేదనే నేతలు భావిస్తున్నారట. అందులోనూ బరిలో ఉంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యేలు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే వ్యవహారం కాదని అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నారట. అయితే పలు దఫాలుగా, పలువురు అధిష్టానం నేతలు తాజా మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసింది.

దీంతో మొదట అధిష్టానం భావించినట్లుగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డినే ఎలాగైనా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి, సానుభూతి, జిల్లాలో అందరినేతలను సమన్వయం చేసుకునే స్వభావం ఉండడంతో ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఆల బరిలో ఉంటే పార్లమెంట్ నియోజకవర్గంలో ఓడిన మాజీ ఎమ్మెల్యేలు సైతం పార్టీకోసం ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేసే అవకాశం ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇంత డిస్కషన్ జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల బరికి దూరంగా ఉండాలని ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరులు సూచిస్తున్నారట. అధిష్టానం బుజ్జగింపులకు ఆల తలగ్గొతారా.. అనుచరుల సూచనకే ఆమోదం వేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..