Water in Gas Cylinder: సిలీండర్‌లో గ్యాస్‌కు బదుల నీళ్లు.. ఏంటి భయ్యా ఈ విడ్డూరం..?
కడప జిల్లాలో ఓ విడ్డూరం వెలుగులోకి వచ్చింది. వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ ఇంధనానికి బదులుగా.. నీళ్లు వచ్చాయి. దీంతో అవాక్కైన కుటుంబం తెల్ల ముఖం వేసింది. ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండలలో గ్యాస్ కి బదులు నీరు రావడం సర్వసాధారణం అయిపోయింది. అది ఏజెన్సీల తప్ప లేక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల పొరపాటు తెలియదు గానీ, వినియోగదారులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు.
కడప జిల్లాలో ఓ విడ్డూరం వెలుగులోకి వచ్చింది. వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ ఇంధనానికి బదులుగా.. నీళ్లు వచ్చాయి. దీంతో అవాక్కైన కుటుంబం తెల్ల ముఖం వేసింది. ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండలలో గ్యాస్ కి బదులు నీరు రావడం సర్వసాధారణం అయిపోయింది. అది ఏజెన్సీల తప్ప లేక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల పొరపాటు తెలియదు గానీ, వినియోగదారులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. గ్యాస్ కి బదులు నీరు వచ్చిందని ఏజెన్సీల దగ్గరకు పోతే వారు చేసేదేమీ లేక గ్యాస్ ను రీఫిల్ చేసి ఇవ్వలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో వినియోగదారులకు పూర్తిగా నష్టపోతున్నారు. అయితే ఇలాంటి సంఘటన ఇప్పుడు కడప జిల్లాలో కూడా జరిగింది
కడప జిల్లాలోని చెన్నూరు మండలంలోని రామన్నపల్లె గ్రామంలో శివశంకర్ రెడ్డి తన తల్లి పేరు మీద గణేష్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవటంతో.. కొత్త సిలిండర్ కోసం ఏజెన్సీకి రిక్వెస్ట్ పెట్టాడు. దీందో.. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ రానే వచ్చింది. ఇక.. వచ్చిన సిలిండర్‌ను తీసుకుని.. దాన్ని స్టౌకు అనుసంధానించాడు. అయితే.. ఎన్ని సార్లు ట్రై చేసిన గ్యాస్ స్టౌ మాత్రం వెలగట్లేదు. కొత్త సిలిండర్ పెట్టినా వెలగకపోవటమేంటీ అని అనమానం వచ్చింది. ముందు స్టౌను క్షుణ్ణందా పరిశీలింటారు. ఎక్కడా ఎలాంటి సమస్య లేదు.
చివరికి గ్యాస్ సిలిండర్‌ను ఊపి రివర్స్ చేయగా, అందులో నుంచి నీరు కారుతుండడం చూసి అనుమానంతో దానిని వీడియో తీశారు శివశంకర్ రెడ్డి. అయితే ఇదే విషయాన్ని గ్యాస్ ఏజెన్సీ వారి దృష్టికి తీసుకురాగా, సిలిండర్‌ను వెనక్కి తీసుకుని, ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితులు లబోదివ్వమంటున్నారు. దీనికి ఎవరిని బాధ్యుల్ని చేస్తారు అని శివశంకర్ రెడ్డి ఏజెన్సీ వారిని ప్రశ్నించగా మాకు సంబంధం లేదని గ్యాస్ ఏజెన్సీ నుంచి సమాధానం వచ్చింది. వినియోగదారులను ఇలా మోసం చేస్తున్న సంస్థలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.
ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ తప్పిదమా లేక ఇండియన్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ తప్పిదము తెలియదు గానీ వినియోగదారుడు నష్టపోవడం మాత్రం నిజం. రూ. 1000 లేదా 1100 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసి, అందులో గ్యాస్ లేకపోగా డబ్బులు నష్టపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న బాధితులు ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి న్యాయం చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…