- Telugu News Photo Gallery YS Sharmila's Son Raja Reddy Ties The Knot With Atluri Priya at Rajasthan Jodhpur Palace, Shares Photos
YS Rajareddy- Atluri Priya: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియ.. పెళ్లి ఫొటోలు చూశారా?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్ వేదికగా ఈ వివాహ వేడుక జరిగింది. ఇరుకుటుంబాల సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Updated on: Feb 17, 2024 | 9:48 PM

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్ వేదికగా ఈ వివాహ వేడుక జరిగింది. ఇరుకుటుంబాల సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఈ సందర్భంగా కుమారుడు రాజా రెడ్డి, కోడలు ప్రియకు కంగ్రాట్స్ చెప్పారు షర్మిల. అలాగే పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీంతో వీరి పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు రాజారెడ్డి, ప్రియ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వివాహ వేడుకల్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 18న) ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం 7 గంటలకు తలంబ్రాల వేడుక నిర్వహించనున్నారని సమాచారం

కుమారుడి పెళ్లి వేడుకల కోసం వైఎస్ షర్మిల దంపతులు రెండు రోజుల క్రితమే రాజస్థాన్‌లోని జోధ్ పూర్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. శనివారం (ఫిబ్రవరి 15) సంగీత్, మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు వైఎస్ షర్మిల. గత నెల 18న హైదరాబాద్‌లో రాజారెడ్డి, ప్రియల ఎంగేజ్మెంట్ ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.