- Telugu News Photo Gallery Cinema photos Hero Nani next movie with balagam venu new factor telangana slang movie , details here Telugu heroes Photos
Nani: నేచురల్ స్టార్ నానికి అదొక లెక్క.! విలేజ్ స్టోరీస్ నుండి మాస్ వరకు ఎన్ని చేసాడు.
నెక్స్ట్ ఏంటి? అంటూ నానిని చూసి అడిగేవారికి ఓ మంచి న్యూస్ వినిపిస్తోంది. బలగం వేణు దర్శకత్వంలో నాని హీరోగా సినిమాకు సర్వం సిద్ధమవుతోంది. బలగం సినిమాలో ఆడియన్స్ మనసుకు దగ్గరైన కాన్సెప్టును వండర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు వేణు. ఇప్పుడు నాని రేంజ్‌కి సూట్ అయ్యే కథతో మరోసారి బ్లాక్‌బస్టర్ వేణు అనిపించుకోవడానికి రెడీ అవుతున్నారు. విలేజ్ స్టోరీస్‌ని కెరీర్ మొదటి నుంచి కూడా అడపాదడపా టచ్ చేస్తూనే ఉన్నారు నాని.
Updated on: Feb 17, 2024 | 10:09 PM

స్టార్ హీరోలు కొత్త సినిమాలకు సైన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని లిస్ట్ ప్రిపేర్ చేస్తే... అందులో వెరీ ఫస్ట్ ప్లేస్లో కనిపించే మాట... జోనర్‌ని చేంజ్ చేయాలి అనేది. నెక్స్ట్ లుక్, ఆ తర్వాత డిక్షన్... ఇలా లిస్టు కంటిన్యూ అవుతుందనుకోండి.!

చెక్ లిస్టు ఎంత పెద్దగా ఉన్నప్పటికీ, మనసుకి ఇష్టమైన వాటి వైపు మొగ్గకుండా ఉండటం ఎవరికి సాధ్యం చెప్పండి... నేచురల్ స్టార్ నానీ అయినా అందుకు అతీతం కాదు... ఏవంటారు? అంతేనంటారా... ఇంతకీ నానీ ఏం చేస్తున్నారు? మనసుకు నచ్చిన విషయాన్ని మనస్ఫూర్తిగా చేస్తే సక్సెస్ రాకుండా ఎలా ఉంటుంది?

ఎక్కడికిపోతుంది? ఈ విషయాన్నే అద్భుతంగా కన్వే చేశారు హాయ్ నాన్నలో. అటు వ్యక్తిగతంగా, ఇటు వృత్తిపరంగా అనుకున్నది సాధించుకున్న వ్యక్తిగా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు నాని. ఆ మూవీలో స్టైలిష్‌గా కనిపించిన నేచురల్ స్టార్, నెక్స్ట్ సరిపోదా శనివారం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు.

నెక్స్ట్ ఏంటి? అంటూ నానిని చూసి అడిగేవారికి ఓ మంచి న్యూస్ వినిపిస్తోంది. బలగం వేణు దర్శకత్వంలో నాని హీరోగా సినిమాకు సర్వం సిద్ధమవుతోంది. బలగం సినిమాలో ఆడియన్స్ మనసుకు దగ్గరైన కాన్సెప్టును వండర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు వేణు.

ఇప్పుడు నాని రేంజ్‌కి సూట్ అయ్యే కథతో మరోసారి బ్లాక్‌బస్టర్ వేణు అనిపించుకోవడానికి రెడీ అవుతున్నారు. విలేజ్ స్టోరీస్‌ని కెరీర్ మొదటి నుంచి కూడా అడపాదడపా టచ్ చేస్తూనే ఉన్నారు నాని.

రీసెంట్‌గా దసరాలో నాని పెర్ఫార్మెన్స్ కీ, ఆయన లుక్స్ కీ ఫిదా అయిపోయారు జనాలు. ధూమ్ ధామ్ అంటూ పండగ చేసుకున్నారు. మళ్లీ నానిని అలాంటి లుక్‌లో చూడబోతున్నామనే ఆనందం కనిపిస్తోంది నేచురల్ స్టార్ ఆర్మీలో.

మరి ఈ సారి నానితో వేణు తెలంగాణ శ్లాంగ్‌నే మాట్లాడిస్తారా? లేకుంటే మరేదైనా బ్యాక్ డ్రాప్ తీసుకుంటారా?, నానికోసం క్రియేట్ చేసే మేనరిజమ్స్ ఎలా ఉంటాయి అనే ఆసక్తి కూడా క్రియేట్ అయింది.




