- Telugu News Photo Gallery Cinema photos Power star Pawan kalyan OG Movie shooting completed 70% and sujeeth pawan kalyan photo viral in social media Telugu Heroes Photos
Pawan kalyan – OG: ఏంటి.? OG మూవీ ఒరిజినల్ కంటెంట్ ఆ.! పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగే..
పవర్ స్టార్‌లోని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌ను ఓజిలో చూపిస్తున్నారు సుజీత్. మిగిలిన దర్శకులతో పోలిస్తే సుజీత్ పక్కా ప్లానింగ్‌తో తన సినిమా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే OG షూటింగ్ 70 శాతం పూర్తైంది. తాజాగా బయటికొచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో సుజీత్ భుజంపై చేయి వేసి నడుస్తున్నారు పవన్. సుజీత్, పవన్ ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్. ఒక్క ఫోటోకే ఈ క్రేజ్ ఉంటే.. రేపు సినిమా వచ్చాక ఎలా ఉంటుందో..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Feb 17, 2024 | 10:09 PM

ఒక్క ఫోటో.. ఒకే ఒక్క ఫోటో.. అందులో కనీసం మొహం కూడా చూపించలేదు.. బ్యాక్ సైడ్ నుంచి అలా నడిచెళ్తున్న ఫోటో.. దానికే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అసలు OG విషయంలో సుజీత్ ఏం చేస్తున్నారు..?

మిగిలిన సినిమాలపై కూడా బజ్ ఉంది.. కానీ వాటిని మించిన బజ్ OGలోనే ఎందుకు కనిపిస్తుంది..? ఇదంతా ఒరిజినల్ కంటెంట్‌కు ఉన్న మహిమేనా..? పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఎలా ఉన్నా.. అక్కడెలాంటి విమర్శలు వచ్చినా.. సినిమాల వరకు వచ్చేసరికి మాత్రం ఈయన కింగ్ అంతే.

ఒక్క అప్‌డేట్‌తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. OGకి ఇదే జరుగుతుంది. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. ఎన్నికలు పూర్తయ్యాకే మళ్లీ సినిమాల వైపు రానున్నారు పవన్. ఈ లోపు ప్రమోషన్స్ ఎక్కడా ఆపట్లేదు ఓజి టీమ్.

పవన్ డైరక్టర్లలో.. డబుల్ సక్సెస్ చూడాలన్న టెన్షన్ సుజీత్‌కి కాస్త తక్కువే. మిగిలిన ఇద్దరికీ అదర్ ప్రాజెక్టులున్నాయి. సుజిత్ మాత్రం ప్రస్తుతం ఓజీ మీదే ఉన్నారు. ఓజీ పూర్తయ్యాక నేచురల్ స్టార్‌ని డైరక్ట్ చేయాలి. సో.. ముందయితే ఓజీని సక్సెస్ చేయాలన్న గోల్‌తో సాగుతున్నారు సుజిత్.

ఇప్పటికే OG షూటింగ్ 70 శాతం పూర్తైంది. తాజాగా బయటికొచ్చిన ఓ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందులో సుజీత్ భుజంపై చేయి వేసి నడుస్తున్నారు పవన్. సుజీత్, పవన్ ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్.

ఒక్క ఫోటోకే ఈ క్రేజ్ ఉంటే.. రేపు సినిమా వచ్చాక ఎలా ఉంటుందో..? పవన్ మరో 15 రోజులు ఇస్తే ఓజి పూర్తైపోతుంది. జూన్ ఫస్ట్ వీక్‌లో డేట్స్ అడ్జస్ట్ చేయాలని చూస్తున్నారు పవన్.

పవన్ కల్యాణ్ కోసం చాన్నాళ్లు వెయిట్ చేసిన క్రిష్.. ఈ మధ్యనే అనుష్కతో ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాను మొదలుపెట్టారు. అసలే వేదంతో సక్సెస్ చూసిన కాంబో కావడంతో, క్రిష్ - అనుష్క మూవీ మీద గట్టి హోప్స్ ఉన్నాయి జనాలకు. ఈ సినిమా సక్సెస్ రేంజ్ హరిహరవీరమల్లు సెట్స్ లో కనిపించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు క్రిష్.





























