Pragya Jaiswal: కన్ను కొట్టి కవ్విస్తున్న కంచె బ్యూటీ.. కుర్రాళ్లను ఆపతరమా..!
ప్రగ్య జైస్వాల్ .. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ హాట్ బ్యూటీ. తమిళ్ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి వచ్చింది ఈ అమ్మడు. విరాట్టుతో 2014లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రగ్య నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి.
Rajeev Rayala | Edited By: Ravi Kiran
Updated on: Feb 17, 2024 | 5:12 PM

ప్రగ్య జైస్వాల్ .. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ హాట్ బ్యూటీ. తమిళ్ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి వచ్చింది ఈ అమ్మడు. విరాట్టుతో 2014లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ప్రగ్య నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి.

2015లో టాప్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ప్రగ్య జైస్వాల్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించింది. ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

కంచె సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాకు గాను ప్రగ్య ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. అయితే ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు.

అఖండ లాంటి సినిమా భారీ విజయం సాధించినప్పటికీ అది బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. దాంతో ఈ అమ్మడికి ఎప్పటిలానే అవకాశాలు తగ్గిపోయాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపుతోంది ప్రగ్య జైస్వాల్. రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది.

హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అభిమానులతో టచ్ లో ఉంటుంది ఈ వయ్యారి. తాజాగా మరోసారి కొన్ని గ్లామర్ ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుర్రాళ్ళు ఈ ఫోటోలకు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.





























