- Telugu News Photo Gallery Cinema photos Director Puri Jagannath broke his promise for the first time with the postponement of Double Smart
Double Ismart: తొలిసారి ఇచ్చిన మాట తప్పిన పూరీ.. అదేంటంటే..
మాటిచ్చాం కదా అని.. క్వాలిటి లేని ఔట్ పుట్ తీసుకొచ్చి ప్రేక్షకులకు ఇవ్వలేం కదా..? తీరా సినిమా పోయాక.. మళ్లీ మనకే బాధ బోనస్ అంటున్నారు పూరీ జగన్నాథ్. అందుకే కెరీర్‌లో తొలిసారి ఆయన రాసుకున్న శాసనాల గ్రంథంలో మాట తప్పుతున్నారు. చెప్పిన డేట్‌కు సినిమా పూర్తి చేయలేక వాయిదా వేస్తున్నారు. మరి డబుల్ ఇస్మార్ట్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు..?
Updated on: Feb 17, 2024 | 4:22 PM

డబుల్ ఇస్మార్ట్ వాయిదా పడనుందా అనే అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్ పోన్ అయ్యింది. కొత్త డేట్ ఎప్పుడనేడది తెలిపారు మేకర్స్. ప్లానింగ్‌కు ప్యాంట్ షర్ట్ వేసినట్లుండే పూరీ జగన్నాథ్ ప్లాన్ కూడా అప్పుడప్పుడూ తప్పుతుంది.

అందుకే అనుకున్న తేదీకి డబుల్ ఇస్మార్ట్‌ను సిద్ధం చేయలేకపోతున్నారు ఈ దర్శకుడు. డెడ్ లైన్ అందుకోలేక.. కొత్త డేట్ చూసుకుంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఇంకా నెల రోజుల వరకు బ్యాలెన్స్ ఉండిపోయింది.

హడావిడిలో పూర్తి చేసి క్వాలిటీ మిస్సైతే అనవసరంగా బాధ పడాల్సి వస్తుంది. అందుకే టైమ్ తీసుకున్నా పర్లేదని మార్చ్ 8 నుంచి సినిమాను వాయిదా వేశారు మేకర్స్. అదే రోజు రానున్న విశ్వక్ సేన్ గామితో పాటు గోపీచంద్ భీమా కూడా విడుదలవుతున్నాయి.

షూటింగ్ పూర్తైనా.. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ కోసమే ఎక్కువ టైమ్ కావాలి. లైగర్ రేంజ్ ప్రమోషన్స్ చేయాలంటే కనీసం నెల కంపల్సరీ. పైగా ఆ డిజాస్టర్‌కు డబుల్ ఇస్మార్ట్‌తో సమాధానమివ్వాలనే కసితో ఉన్నారు పూరీ.

మరోవైపు రామ్ కూడా స్కందతో డిసప్పాయింట్ చేసారు. అందుకే జూన్ 14న డబుల్ ఇస్మార్ట్ విడుదల ప్లాన్ చేస్తున్నారు. అప్పుడైతే అన్నింటికీ వీలుగా ఉంటుందని భావిస్తున్నారు పూరీ.




