AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్.. ప్లాన్ అఫ్ యాక్షన్ ఇదే..

హైదరాబాద్‎లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి దృష్టి సారించారు. గొడవలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలకు గురైన వారికి వెంటనే సత్వర సహాయం అందించేందుకు 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్.

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్.. ప్లాన్ అఫ్ యాక్షన్ ఇదే..
Cp Srinivas Reddy
Ashok Bheemanapalli
| Edited By: Srikar T|

Updated on: Feb 18, 2024 | 9:00 AM

Share

హైదరాబాద్‎లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి దృష్టి సారించారు. గొడవలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలకు గురైన వారికి వెంటనే సత్వర సహాయం అందించేందుకు 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్. హైదరాబాద్ కమిషనరేట్‎లోని విద్యార్థులు, యువత, ఆటో, లారీ ట్రక్, కార్ డ్రైవర్స్ ప్రతి ఒక్కరికి రోడ్డు ప్రమాధాలపై పోలీసులు అవర్నెస్ కల్పిస్తున్నరు. ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 150 కార్యక్రమలు నిర్వహించగా 35వేల మంది హాజరయ్యారు. పాతబస్తీ నుంచి మొదలుకొని హైదరాబాద్‎లో రోడ్డు సేఫ్టీ మహోత్సవం 2024లో భాగంగా అంతటా ట్రాఫిక్ నియంత్రణ చర్యలతో పాటు రోడ్డు భద్రత ప్రమాణాలపై హైదరాబాద్ పోలీసులు అవగహన కల్పిస్తున్నరు.

హైదరాబాద్ సీపీ ప్రారంభించిన 108 ట్రాఫిక్ మొబైల్ బైకులు హైదరాబాద్ అంతటా తిరగనున్నాయి. ప్రమాదాలకు గురైన వారిని వెంటనే కాపాడేందుకు, ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్‎లు ట్రాఫిక్‎లో చిక్కుకుపోతుండటంతో ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ మొబైల్ పోలీసులకు సీపీఆర్, ప్రథమ చికిత్సపై వైద్యల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం పడుతుందని, ట్రాఫిక్‎పై అవగాహన ఉన్న పోలీసులకు మాత్రమే ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాల బాధ్యతలు అప్పజెప్పారు. 108 వాహనాలు నిరంతరం హైదరాబాద్ కమీషనర్ పరిధిలో తిరుగుతాయని ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వైలేషన్స్ అయిన క్విక్ రియాక్షన్ టీం లాగా మొబైల్ పోలీసులు అందుబాటులో ఉంటారని, వెహికల్స్ పాతవి అయినా అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దామని హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రూల్స్‎ని ప్రతి ఒక్కరు ఫాలో కావాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.

పార్కింగ్ ఆక్రమణలు, ట్రాఫిక్ పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని, రూల్స్ ఫాలో కాకుంటే చలన్ వేసి ముక్కుపిండి వసూల్ చేస్తామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటమని, ఎంత పెద్దోడైన ఎవ్వరిని వదలే ప్రసక్తేలేదన్నారు. గూడ్స్ వెహికిల్స్ వల్ల ట్రాఫిక్ ఎక్కువవవుతుందని, వాటికి కేటాయించిన సమయంలో మాత్రమే రావాలన్నారు. కేటాయించిన సమయంలో కాకుండా మిగతా సమయంలో వస్తే చలన్స్ వేస్తామన్నారు. ట్రాఫిక్‎పై కొత్త రెగ్యులేషన్స్ తెబోతున్నామని, ట్రాఫిక్ లెస్ సిటీగా హైదరాబాద్ మారనుందన్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ నగర ప్రజలు ఇంటి నుంచి బయటకొస్తే సేఫ్‎గా మళ్ళీ ఇంటికి చేరుకునేలా హైదరాబాద్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఓవర్ రాష్ డ్రైవ్ నడిపి ఇంట్లోవారికి శోకం మిగల్చవద్దని, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలని హైదరాబాద్ నగరం పేరు కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు ఇలా అవగహన సదస్సులు నిర్వహిస్తూన్నారు. ఈ క్రమంలోనే 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలను అందుబాటులో ఉంచారు. రోడ్లపై రూల్స్ ప్రతి ఒక్కరు ఫాలో కావాలని, ఇతర దేశస్థులకు హైదరాబాద్ ప్రజలు మంచి వాళ్లుగా పేరొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. భయం లేకుండా డ్రైవ్ చెయ్యాలని, ట్రాఫిక్ అనేది జీవనది లాంటిదని, పోలీసులు నిరంతరం కష్టపడుతూనే ఉంటారన్నారు. నిత్యం రోడ్లమీదకి వేలాది వాహనాలు వస్తుండగా ఒక్కరు చేసే తప్పుతో ట్రాఫిక్ వల్ల మిగతవారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలా హైదరాబాద్ రోడ్లపై సాఫీగా వాహనాలు ముందుకెళ్లేలా..రద్దీకి కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకొని, ఇకనుండి నిరంతర ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోబోనున్నారు హైదరాబాద్ పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..