AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొల్లాపూర్ మామిడికి మంచిరోజులు వచ్చాయ్.. దక్కిన అరుదైన గౌరవం.. వివరాలు ఇవిగో.!

కొల్లాపూర్ మామిడి మంచిరోజులు.. యస్.. ప్రపంచ వ్యాప్తంగా జియో గ్రాఫికల్ ఇండికేషన్‌ ట్యాగ్‌తో గుర్తింపు పొందిన కాకినాడ కాజా, అరకు కాఫీ, ఆగ్రా కేతా మిఠాయి లిస్టులో కొల్లాపూర్‌ మామిడి కూడా చేరింది.

కొల్లాపూర్ మామిడికి మంచిరోజులు వచ్చాయ్.. దక్కిన అరుదైన గౌరవం.. వివరాలు ఇవిగో.!
Kollapur Mangos
Ravi Kiran
|

Updated on: Feb 17, 2024 | 9:00 PM

Share

కొల్లాపూర్ మామిడి మంచిరోజులు.. యస్.. ప్రపంచ వ్యాప్తంగా జియో గ్రాఫికల్ ఇండికేషన్‌ ట్యాగ్‌తో గుర్తింపు పొందిన కాకినాడ కాజా, అరకు కాఫీ, ఆగ్రా కేతా మిఠాయి లిస్టులో కొల్లాపూర్‌ మామిడి కూడా చేరింది. తెలంగావ్యాప్తంగా కొల్లాపూర్‌ మామిడి ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది. జీఐ ట్యాగ్‌ కేటాయింపుతో మామిడి రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. నేలల్లో పోషకాలతో ప్రత్యేక రుచిని సంతరించుకున్న కొల్లాపూర్ మామిడి.. రానున్న రోజుల్లో దిగుబడి అంతకుమించి అనేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సురభి రాజుల కాలంలో పురుడుపోసుకున్న ఈ మామిడి.. రుచిలో రా రాజుగా నాగర్‌కర్నూల్‌ జిల్లాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. 120 ఏళ్ల క్రితం సురభి వంశ రాజులు ఈ మామిడి తోటలను ప్రారంభించారు. నూజివీడు నుంచి తీసుకొచ్చిన మామిడి మొక్కలను కొల్లాపూర్‌లోని కోటలో సాగు చేశారు. ఇక్కడి వాతావరణం, నేలలు అనుకూలించి మామిడి పండ్ల సైజు, రుచి నూజివీడును మించిపోయింది. కొల్లాపూర్‌ నేలల్లో టోటల్‌ సాల్యుబుల్‌ సాలిడ్స్‌ అధికంగా ఉండటంతో మామిడి పంటకు ప్రత్యేకత ఏర్పడింది. పండులోని కండ మెత్తగా ఉండటం, పీచులేకపోవడం, ఎక్కువగా మచ్చలు లేకపోవడం, తీయగా ఉండటంతో ఈ మామిడి తినేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు.

సురభి రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా రుచిలో ఎలాంటి తేడా లేదు. మధుర ఫలం మామిడి తీపిలో ఎలాంటి తేడా లేకుండా కొల్లాపూర్‌ మామిడి గుర్తింపు పొందింది. జీఐ సూచికతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ బ్రాండ్‌తో కొల్లాపూర్‌ మామిడి అమ్మకాలు జోరందుకోనున్నాయి. అంతేకాదూ మామిడి రైతులకు ఆదాయం రెట్టింపుకానుంది.

అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌తో కొల్లాపూర్‌ మామిడి పండ్లు మార్కెట్లను ముంచెత్తుతుంటాయి. రుచిలో అమృతం, రూపంలో బంగారు వర్ణంతో పోటీ పడే ఈ మామిడి పండ్లు ప్రజలకు ఎండాకాలంలో తీపిని పంచుతాయి. ఉమ్మడి పాలమూరుతోపాటు రాష్ట్రం, దేశ సరిహద్దులుదాటి అంతర్జాతీయ స్థాయిలో కొల్లాపూర్‌ మామిడి ఆదరణ పొందింది. సురభి రాజుల కాలంలో పురుడుపోసుకున్న ఈ మామిడి.. రుచిలో రా రాజుగా నాగర్‌కర్నూల్‌ జిల్లాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.

కొల్లాపూర్‌లో సాగైన మామిడి దేశవిదేశీ మార్కెట్లలో సందడి చేస్తుంది. కిలో 30 నుంచి 50 రూపాయల వరకు పలుకుతుంది. చాలా మంది వ్యాపారులు తోటల దగ్గరికే వెళ్లి పండ్లను తీసుకెళ్తారు. ఇలా ప్రజల ఆదరణ ఉన్న ఈ మామిడిని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం సబ్సిడీలు సైతం ఇస్తోంది. ఉద్యానవన శాఖలో రైతులకు తోటల పెంపకంతోపాటు మామిడి దిగుబడి వచ్చాక విక్రయించేందుకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కొనుగోళ్లను కూడా చేపడుతోంది. దీంతో రైతులు మామిడి పంటను సాగుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..