AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 Minutes Walking: ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాలు వాకింగ్ చేస్తే.. శరీరంలో అద్బుతమైన మార్పులు!

గ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల మీ ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. ఇది కండరాలకు బలాన్ని ఇస్తుంది. బాడీ ఫిట్‌గా ఉంటుంది. తద్వారా ఒళ్లు నొప్పుల సమస్య కూడా తగ్గుతుంది. ఉదయం సూర్యరశ్మిలో నడవడం ద్వారా మీకు కావాల్సినంత విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడంత పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల..

30 Minutes Walking: ఉదయాన్నే ఖాళీ కడుపుతో 30 నిమిషాలు వాకింగ్ చేస్తే.. శరీరంలో అద్బుతమైన మార్పులు!
Walking
Jyothi Gadda
|

Updated on: Feb 18, 2024 | 7:37 AM

Share

వేకువజామున ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిలరావాలు, స్వచ్ఛమైన గాలిలోఉదయాన్నే వాకింగ్‌ చేస్తే.. ఒక నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. అంతేకాదు.. ఇలా ఖాళీ కడుపుతో నడవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అల్పాహారానికి ముందు 30 నిమిషాల వాకింగ్‌ మీ శరీరంలో అద్భుతమైన మార్పులను కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో నడవడం వల్ల మీ శరీరం కొవ్వును బాగా కరిగిస్తుంది. అల్పాహారం తినే ముందు వ్యాయామం చేయడం వల్ల కొవ్వు ఆక్సీకరణం పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే మీరు వాకింగ్‌ చేసేందుకు కావాల్సిన శక్తి కోసం ఇంధనం కోసం మీరు ఎక్కువ కొవ్వును కాల్చేస్తారన్నమాట.

ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దాంతో అతి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఉదయాన్నే వాకింగ్‌ చేయడం వల్ల మీ జీవక్రియ మెరుగవుతుంది. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది. ఇది రోజంతా కేలరీల ఖర్చును పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వాకింగ్ వల్ల మీ ఎనర్జీ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది బాడీలో రక్త ప్రసరణ వేగం పెంచడంతో పాటు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తాయి. తద్వారా హుషారుగా ఉండొచ్చు.

ఉదయం పూట ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే జీర్ణశక్తి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వల్ల బాడీలో ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. ఇది మంచి మూడ్‌కు కారణమవుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఆత్మపరిశీలనకు అవకాశం కల్పిస్తుంది. ఇది మీ మనస్సు నుండి ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి, మీలో సానుకూల ఆలోచనలను పెంపొందించడానికి మీకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉదయం పూట సూర్యరశ్మిలో వాకింగ్ చేయడం వల్ల బాడీకి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. ఇది మంచి నిద్రకు కారణమవుతుంది. ఒత్తిడి తగ్గించి మంచి నిద్రకు దోహదపడుతుంది. రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల మీ ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. ఇది కండరాలకు బలాన్ని ఇస్తుంది. బాడీ ఫిట్‌గా ఉంటుంది. తద్వారా ఒళ్లు నొప్పుల సమస్య కూడా తగ్గుతుంది. ఉదయం సూర్యరశ్మిలో నడవడం ద్వారా మీకు కావాల్సినంత విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడంత పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి ఆందోళన చెందుతున్న వారికి మార్నింగ్ వాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తినడానికి ముందు మార్నింగ్ వాకింగ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది బ్లడ్ షుగర్ నియంత్రణను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాదు అజీర్ణం లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారు మార్నింగ్ వాక్ చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. మార్నింగ్ వాక్ వల్ల కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..