AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Videos: యముడు లంచ్ బ్రేక్ లో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలు.. వామ్మో వైరల్ వీడియో చూస్తే..

CCTV కెమెరాలో రికార్డైన ఒక దృశ్యంలో వేగంగా వెళ్తున్న కారు వారి సమీపంలోకి అకస్మాత్తుగా ప్రవేశించినప్పుడు రెస్టారెంట్‌లో భోజనం చేసేవారు తృటిలో గాయపడకుండా తప్పించుకున్నారు. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్‌ ఇచ్చారు. ఈ ఆక్సిడెంట్‌ జరిగిన క్షణంలో యమరాజు లంచ్‌బ్రేక్‌లో ఉన్నాడనుకుంటా..! అందుకే వాళ్లకు ఈ భూమ్మీద బతకడానికి వీలు కలిగిందంటూ పలువురు కామెంట్‌ చేశారు.

Viral Videos: యముడు లంచ్ బ్రేక్ లో ఉన్నప్పుడు జరిగిన ప్రమాదాలు.. వామ్మో వైరల్ వీడియో చూస్తే..
Tragic Incidents
Jyothi Gadda
|

Updated on: Feb 16, 2024 | 3:13 PM

Share

చాలా మంది వాహనదారులు, ప్రయాణికులు ఘోర ప్రమాదాల నుండి తృటిలో తప్పించుకుంటారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో చాలా మంది మరణం అంచుల దాకా వెళ్లి సురక్షితంగా బయటపడుతుంటారు. బహుశా వారికి దైవం అండగా ఉంటుందనుకుంటా..లేదంటే అలాంటి వారికి ఈ భూమ్మీద ఇంకా నూకలు మిగిలే ఉన్నాయని అనుకోవాల్సిందే. సోషల్ మీడియా వినియోగదారులు అలాంటి ప్రమాదాలు, రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకున్న వీడియోలు ప్రతి నిత్యం సోషల్ మీడియాలో మనం అనేకం చూస్తుంటాం. అలాంటి వారి విషయంలో దైవం అండగా ఉందంటూ నెటిజన్లు సైతం పలు రకాలుగా స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి.

వాహనాలు నడిపే సమయంలో పరధ్యానంతో కొందరు, మాదకద్రవ్యాల ప్రభావంతో మరికొందరు ప్రమాదకరమైన రీతిలో డ్రైవింగ్‌ చేస్తుంటారు. అలాంటి వారి నిర్లక్ష్యంగా కారణంగా తోటి వారు కూడా ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే, బైక్‌లు నడుపుతున్నప్పుడు లేదా కార్లు నడుపుతున్నప్పుడు ప్రజలు రెప్పపాటులో ప్రమాదాల నుండి అద్భుతంగా తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్‌ ఇచ్చారు. ఈ ఆక్సిడెంట్‌ జరిగిన క్షణంలో యమరాజు లంచ్‌బ్రేక్‌లో ఉన్నాడనుకుంటా..! అందుకే వాళ్లకు ఈ భూమ్మీద బతకడానికి వీలు కలిగిందంటూ పలువురు కామెంట్‌ చేశారు.

CCTV కెమెరాలో రికార్డైన ఒక దృశ్యంలో వేగంగా వెళ్తున్న కారు వారి సమీపంలోకి అకస్మాత్తుగా ప్రవేశించినప్పుడు రెస్టారెంట్‌లో భోజనం చేసేవారు తృటిలో గాయపడకుండా తప్పించుకున్నారు.

మరొక వీడియోలో స్కూటర్ రైడర్ U-టర్న్ వద్ద వేగంగా వ్యక్తిని ఢీకొనడంతో అతడు తృటిలో తప్పించుకోవడం కనిపించింది.

మరొక క్లిప్‌లో, స్కూటర్ హ్యాండిల్‌బార్‌పై ఒక భారీ చెట్టు పడిపోవడంతో బైకర్ తృటిలో తప్పించుకున్నాడు.

ముఖ్యంగా ప్రమాదకరమైన సన్నివేశంలో, ఇద్దరు పాదచారులు ఒకరినొకరు పట్టుకోవడం ద్వారా పడిపోతున్న ట్రక్కును తృటిలో తప్పించుకుంటారు.

అదేవిధంగా, ఒక వ్యక్తి కారు దగ్గరకు వచ్చినప్పుడు ఢీకొనకుండా తప్పించుకుంటాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..