Milk with pumpkin seed: పాలతో కలిపి గుమ్మడి గింజలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

ఇది ఎముక పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి వంటి ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం వల్ల వచ్చే మరో దుష్ప్రభావం రక్తంలో కాల్షియం స్థాయి కూడా తగ్గుతుంది. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ఈ విధంగా ఎముకలకు మేలు చేస్తుంది.

Milk with pumpkin seed: పాలతో కలిపి గుమ్మడి గింజలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
Milk With Pumpkin Seed
Follow us

|

Updated on: Feb 16, 2024 | 2:40 PM

గుమ్మడికాయ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అయితే, 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 574 కేలరీల శక్తిని, 49 గ్రాముల కొవ్వును, 6.6 గ్రాముల ఫైబర్, 30 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇది కాకుండా ఈ గింజలలో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించి అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఇది కాకుండా, గుమ్మడికాయ గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే పాలీఅన్‌శాచురేటెడ్, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అయితే, పాలలో నానబెట్టిన గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

పాలలో నానబెట్టిన గుమ్మడి గింజలను తినటం వల్ల కీళ్లకు ప్రాణం పోస్తుంది. కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గుమ్మడికాయ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. పాలతో నానబెట్టిన గుమ్మడి గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం..

1. ఎముకలకు మేలు చేస్తుంది..

ఇవి కూడా చదవండి

మీరు గుమ్మడి గింజలను పాలతో కలిపి తీసుకుంటే, ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్‌లను అందిస్తుంది. ఈ పోషకాలు సమిష్టిగా ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదల, బలం, నిర్వహణకు తోడ్పడతాయి, ఎముక వ్యాధులను నివారించడంలో గుమ్మడికాయ గింజలతో పాలు సహాయకారిగా చేస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపు వంటివి దూరం చేస్తుంది.

2. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి..

గుమ్మడికాయ గింజలు విటమిన్ ఇ, కెరోటినాయిడ్లతో సహా అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి, కణాల రక్షణకు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

3. కాల్షియం లోపాన్ని తొలగిస్తుంది..

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం ఎముకల పెరుగుదలకు, బలానికి మంచిది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకున్న వ్యక్తులు వారి ఎముకలలో ఖనిజ సాంద్రతను కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముక పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి వంటి ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం వల్ల వచ్చే మరో దుష్ప్రభావం రక్తంలో కాల్షియం స్థాయి కూడా తగ్గుతుంది. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ఈ విధంగా ఎముకలకు మేలు చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..