Healthy Breakfast: మొలకలతో దోశ.. టేస్ట్ సూపర్ గురూ!
ఉదయం హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలని అందరూ అనుకుంటారు. ఇప్పటికే కొన్ని రకాల హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రేక్ ఫాస్ట్ కూడా మీకు నచ్చుతుంది. అదే మొలకలతో చేసే బ్రేక్ ఫాస్ట్. ఎప్పుడూ చేసే బ్రేక్ ఫాస్ట్‌ల కంటే వెరైటీగా తినాలి అనుకున్న వారికి కూడా ఇది బాగా నచ్చుతుంది. మొలకలు తినడం వల్ల పలు రకాల పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. మొలకలు తినడం నచ్చని వారు కూడా ఈ మొలకలతో చేసే దోశ తినొచ్చు. ఇది ఆరోగ్యానికి..

ఉదయం హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలని అందరూ అనుకుంటారు. ఇప్పటికే కొన్ని రకాల హెల్దీ బ్రేక్ ఫాస్ట్‌ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రేక్ ఫాస్ట్ కూడా మీకు నచ్చుతుంది. అదే మొలకలతో చేసే బ్రేక్ ఫాస్ట్. ఎప్పుడూ చేసే బ్రేక్ ఫాస్ట్‌ల కంటే వెరైటీగా తినాలి అనుకున్న వారికి కూడా ఇది బాగా నచ్చుతుంది. మొలకలు తినడం వల్ల పలు రకాల పోషకాలు శరీరానికి బాగా అందుతాయి. మొలకలు తినడం నచ్చని వారు కూడా ఈ మొలకలతో చేసే దోశ తినొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఈ మొలకల దోశను ఎలా తయారు చేస్తారు? మొలకల దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొలకల దోశకు కావాల్సిన పదార్థాలు:
పొట్టు తీయని పెసరపప్పు, అల్లం, పచ్చి మిర్చి, ఆయిల్, జీలకర్ర, ఉప్పు, కొత్తి మీర
మొలకల దోశ తయారీ విధానం:
ముందు రోజు రాత్రి పొట్టు తీయని పెసర పప్పును నానబెట్టుకోవాలి. అవి మొలకలు వచ్చేంత వరకూ ఉంచాలి. మొలకలు త్వరగా రావడానికి తడి గుడ్డలో కడితే వస్తాయి. పెసర పప్పుతో పాటు మీకు నచ్చిన వాటిని యాడ్ చేసుకోవచ్చు. మొలకెత్తిన పెసర పప్పును ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తి మీర వేసి, మెత్తగా దోశ పిండాలి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని.. బాగా కాలనివ్వాలి. ఆ తర్వాత ఆయిల్ వేయాలి. ఇప్పుడు పిండితో దోశలా వేసుకోవాలి. కావాలి అనుకున్న వారు పైన ఉల్లి తరుగును చల్లుకోవచ్చు. దోశను రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. దీన్ని అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే భలేగా ఉంటుంది. మరింకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.








