- Telugu News Photo Gallery Tomatoes Are Good Source Of Several Vitamins And Minerals, Know All The Benefits
Tomatoes for Cancer: క్యాన్సర్ కణాలను రఫ్ ఆడించే టమాటా.. ఆహారంలో వీటిని తప్పక తినాలి
టొమాటోను దాదాపు అన్ని భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఈ టొమాటోలో అనేక పోషకాలు ఉన్నాయి. ఆహారంలో వీటిని తినడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. టమోటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. 110 mg టమోటాలో కాల్షియం ఉంటుంది. టొమాటోలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిల్లోని క్యాల్షియం, విటమిన్ కె కంటెంట్ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంటే టమోటాలు ఎంత ఎక్కువగా తింటే ఎముకలు అంత దృఢంగా ఉంటాయి..
Updated on: Feb 16, 2024 | 8:42 PM

టొమాటోను దాదాపు అన్ని భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఈ టొమాటోలో అనేక పోషకాలు ఉన్నాయి. ఆహారంలో వీటిని తినడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. టమోటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. 110 mg టమోటాలో కాల్షియం ఉంటుంది. టొమాటోలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది.

వీటిల్లోని క్యాల్షియం, విటమిన్ కె కంటెంట్ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. అంటే టమోటాలు ఎంత ఎక్కువగా తింటే ఎముకలు అంత దృఢంగా ఉంటాయి. టొమాటోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టొమాటోలోని విటమిన్ ఎ, విటమిన్ సి రక్తంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ధూమపానం మానేసిన తర్వాత కూడా ధూమపానం వల్ల శరీరానికి జరిగే నష్టాన్ని టమోటా నివారిస్తుంది. టమోటాలలోని యాసిడ్ శరీరాన్ని ధూమపానం ప్రభావం నుంచి కాపాడుతుంది. టొమాటోలోని విటమిన్ ఎ, విటమిన్ బి, పొటాషియం కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. టొమాటోలోని ఇతర ఖనిజాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు టొమాటో చాలా ఎఫెక్టివ్ వెజిటేబుల్ అని చెప్పవచ్చు. మలబద్ధకం, ఇతర పొట్ట సమస్యలు ఉన్నవారు కూడా టమోటాలను ఆహారంలో చేర్చుకోవచ్చు.

శరీరంలోని కొవ్వును తగ్గించుకోవాలంటే టొమాటోలను తప్పనిసరిగా తీసుకోవాలి. టొమాటోలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. టొమాటోలు ప్రోస్టేట్, పొట్ట, కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. టొమాటోలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.




