- Telugu News Photo Gallery Spinach Juice Benefits: Is It Good To Drink Spinach Juice Everyday, Know The Benefits
Spinach Juice: క్యాన్సర్ నుంచి కిడ్నీల వరకు సర్వరోగ నివారిణి.. రోజుకు 2 గ్లాసులు ఈ జ్యూస్ తాగితే చాలు!
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం వంటి కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించడం చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియాతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది. పాలకూరలో కొన్ని ప్రయోజనకరమైన పదార్థాలను మిక్స్ చేసి, దీని జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అయితే ఈ వెజిటబుల్ జ్యూస్‌లో మరికొన్ని పదార్థాలను అదనంగా కలుపుకోవాలి..
Updated on: Feb 16, 2024 | 8:25 PM

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం వంటి కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించడం చాలా అవసరం. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియాతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది.

పాలకూరలో కొన్ని ప్రయోజనకరమైన పదార్థాలను మిక్స్ చేసి, దీని జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అయితే ఈ వెజిటబుల్ జ్యూస్‌లో మరికొన్ని పదార్థాలను అదనంగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. పాలకూరలో మెగ్నీషియం, ఐరన్, జింక్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

బచ్చలికూరలో టొమాటో రసం కలిపి తాగడం వల్ల శారీరక బలహీనత, అలసట, బద్ధకం తొలగిపోతాయి. ఈ ప్రయోజనకరమైన జ్యూస్‌ని రోజూ తీసుకోవడం వల్ల చర్మం ముడతలు తొలగిపోయి, తాజాగా ఉంటాయి. తేనె - నల్ల మిరియాలు కూడా దీనిలో కలిపి తాగవచ్చు. పాలకూర జ్యూస్‌లో తేనెలో కొద్దిగా మిరియాల పొడి కలిపిన తాగితే జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి.

పాలకూర జ్యూస్‌లో క్యారెట్ జ్యూస్ మిక్స్ చేయడం వల్ల రక్తహీనత సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి, శరీరంలోని గాయాలు వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది.

పాలకూర రసాన్ని తయారుచేసేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. రోజుకు రెండుసార్లు ఈ జ్యూస్ తాగితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూరలో ఇతర ఆకుకూరలు కలుపుకుని తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు వెంటనే తొలగిపోతాయి. కడుపులో నులిపురుగుల సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.




