పట్టులాంటి మెరిసే జుట్టు కోసం బియ్యం నీరు.. ఇలా వాడితే రెట్టింపు కేశసౌందర్యం..!

ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా కూడా చేస్తుంది. అందుకే ఇది అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తుంటారు. వెంట్రుకలు అకాల నెరసిపోవడాన్ని నిరోధించే అనేక యాంటీ-ఆక్సిడెంట్లు రైస్ వాటర్‌లో ఉన్నాయి. ఈ నీరు జుట్టును బలపరుస్తుంది. ఇది నిరంతర జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

పట్టులాంటి మెరిసే జుట్టు కోసం బియ్యం నీరు.. ఇలా వాడితే రెట్టింపు కేశసౌందర్యం..!
Rice Water For Hair
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 16, 2024 | 12:55 PM

ఇటు దేశంలో, అటు ప్రపంచంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా మన శరీరం, ఆరోగ్యం అనేక రకాల హానిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం మన జుట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మీరు కూడా జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, కేశాల సంరక్షణ కోసం, మీ జుట్టు మెరుస్తూ ఉండాలంటే మీరు బియ్యం నీటిని ఉపయోగించడం ప్రారంభించండి. దీంతో మీ చిట్లిన, చిక్కుబడ్డ వెంట్రుకలు పట్టులాంటి మెరుపును సంతరించుకుంటాయి. కేశ సౌందర్యం కోసం బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

బియ్యం నీళ్ళు జుట్టుకే కాదు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. కార్బోహైడ్రేట్‌లతో పాటు, ఇందులో ఫెరులిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టు కోల్పోయిన మెరుపును తిరిగి తెచ్చే యాంటీఆక్సిడెంట్. రైస్ వాటర్‌లో ఉండే కార్బోహైడ్రేట్ జుట్టు మెరుపును పెంచడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగుదల, బలానికి సహాయపడుతుంది.

బియ్యం నీళ్ళు ఇలా తయారు చేసుకోండి..

ఇవి కూడా చదవండి

ఒక గిన్నె తెల్ల బియ్యం తీసుకుని దానికి మరో 2 గిన్నెల నీరు కలపండి. ఇప్పుడు ఈ నీటిలో 2 చెంచాల అవిసె గింజలు వేయండి. ఆ తరువాత ఈ నీటిని కనీసం 15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. బియ్యం సగం పచ్చిగా ఉన్నప్పుడు, ఈ నీటిని ఫిల్టర్ చేయండి. ఇప్పుడు ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపుకోండి. ఆ తర్వాత మీరు తలస్నానం చేసే ముందు తయారు చేసుకున్న బియ్యం నీటిని మీ జుట్టుకు పట్టించాలి. ఆ తరువాత 10-15 నిమిషాలు అలాగే వదిలేయండి. దీని తర్వాత శుభ్రమైన నీరు, షాంపూతో కడగాలి. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. మంచి ఫలితాల కోసం రాత్రంతా వదిలేయండి. కానీ గుర్తుంచుకోండి, మీకు ఏదైనా ఫలితం కనిపించాలంటే మీరు రెగ్యులర్‌గా దీన్ని అప్లై చేయాలి.

బియ్యం నీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ జుట్టు క్యూటికల్స్ మెరుగుపడతాయి. దీని ఉపయోగం జుట్టు మెరుపును పెంచుతుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బియ్యం నీరులో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా సిల్కీగా కూడా చేస్తుంది. అందుకే ఇది అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తుంటారు. వెంట్రుకలు అకాల నెరసిపోవడాన్ని నిరోధించే అనేక యాంటీ-ఆక్సిడెంట్లు రైస్ వాటర్‌లో ఉన్నాయి. ఈ నీరు జుట్టును బలపరుస్తుంది. ఇది నిరంతర జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..