సక్సెస్ స్టోరీ..! రోజుకు 250 రూపాయలు సంపాదించే కూలీ.. నేడు నెలవారీ ఆదాయం రూ.3లక్షలు..
తుఫానులో ఇసాక్ ముండా తన కూలిపనిని కూడా కోల్పోయాడు. రోజుకు 250 రూపాయల కూలీతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇసాక్ ముండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఉచిత రేషన్ తప్ప మరేమీ లేదు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ముంబయి తదితర ప్రాంతాల్లో కూలి పని కోసం తిరిగాడు. కానీ కోవిడ్ కారణంగా ఎక్కడ పని దొరకలేదు. కుటుంబాన్ని పోషించడం అత్యంత సవాలుగా మారింది. ఈ క్రమంలోనే తనకో ఆధారం దొరికింది.
కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధంగా కష్టాలను తెచ్చిపెట్టింది. ఒకవైపు ఆరోగ్యం, మరోవైపు ఆర్థిక పరిస్థితి, మరోవైపు ఉద్యోగం కోల్పోవడం వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికీ కోవిడ్ బారి నుంచి బయటపడలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం కష్టాల తుఫానులో చిక్కుకుని బతికిన ఉదాహరణలు కూడా కొన్ని ఉన్నాయి. 250 రూపాయలకు పనిచేస్తూ నేడు బడా వ్యాపారవేత్తగా ఎదిగిన ఒడిశాకు చెందిన ఇసాక్ ముండా జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన మంకీ బాత్‌లో ఇసాక్ ముండా విజయగాథను ప్రస్తావించారు.
ఒడిశాకు చెందిన ఇసాక్ ముండా కూలి పనులు చేస్తుండేవాడు. కూలి పనులు తప్ప మరేమీ తెలియదు. పెద్దగా ఆదాయం లేదు. భార్యాబిడ్డల పోషణకు ఎన్నో అడ్డంకులు, కష్టాల మధ్య సాగే కాపురం వారిది. ఈ క్రమంలోనే 2020 లో కోవిడ్ తుఫాను భారతదేశంలో గందరగోళాన్ని సృష్టించింది. లాక్‌డౌన్ తర్వాత కోవిడ్-19 సెకండ్‌వేవ్ సహా అనేక కారణాల వల్ల, అన్ని రంగాలు మందగించాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ తుఫానులో ఇసాక్ ముండా తన కూలిపనిని కూడా కోల్పోయాడు. రోజుకు 250 రూపాయల కూలీతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇసాక్ ముండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఉచిత రేషన్ తప్ప మరేమీ లేదు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ముంబయి తదితర ప్రాంతాల్లో కూలి పని కోసం తిరిగాడు. కానీ కోవిడ్ కారణంగా ఎక్కడ పని దొరకలేదు. కుటుంబాన్ని పోషించడం అత్యంత సవాలుగా మారింది. ఈ క్రమంలోనే తనకో ఆధారం దొరికింది.
పని లేకుండా ఇంట్లోనే యూట్యూబ్ ద్వారా సంపాదించే అవకాశం ఉందనే సమాచారం అందింది. కానీ YouTubeని ఎలా మానిటైజ్ చేయాలనే దానిపై అతనికి పెద్దగా అవగాహన లేదు. గ్రామానికి చెందిన కొంతమంది యువకులను సంప్రదించి వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత 2020లో ఇసాక్ ముండా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో ఏ వీడియోను పోస్ట్ చేయాలనే సందేహం తలెత్తింది.
ఇసాక్ ముండా తనకు తెలిసిన ఒడిశా సంప్రదాయ వంటల గురించి వీడియో తీయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతనికి కెమెరా ముందు నేర్పరితనం, మాటకారితనం ఏమీ లేవు. కానీ, ప్రయత్నించాడు..తొలుత ఇసాక్ ముండా వీడియోని పెద్దగా ఎవరూ చూడలేదు. ఇది వెయ్యి వీడియోలలో ఒక వీడియో. లైక్స్ రాలేదు, వ్యూస్ పెరగలేదు.
అయినా ఇసాక్ ముండా తన ప్రయత్నాన్ని వదల్లేదు. ఒడిశా సంప్రదాయ ఆహారాన్ని వండుతున్న వీడియోను తన మొబైల్ ఫోన్ ద్వారా పోస్ట్ చేశాడు. కానీ ఇసాక్ ముండా అందిస్తున్న ఒడిశా అరుదైన, ప్రత్యేకమైన వంటకాల కారణంగా, వీడియోలకు నెమ్మదిగా లైక్‌లు, వీక్షణలు రావడం ప్రారంభించాయి. తొలినాళ్లలో పెట్టిన డబ్బులు కూడా రాలేదు. అయినా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. అలా బాసి పఖాలా అనే ఒడిశా వంటకం ఇసాక్ ముండా దశను మార్చేసింది.. ఈ వీడియో వైరల్‌గా మారింది. బ్రెజిల్, అమెరికా, మంగోలియాతో సహా పలు దేశాల్లో ఈ వీడియో భారీ వీక్షణలను పొందింది. ఈ వీడియో తర్వాత ఇసాక్ ముండా సాంప్రదాయ, ప్రత్యేక ఒడిశా ఆహారం బాగా ప్రాచుర్యం పొందింది. యూట్యూబ్ వీడియోలు మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందుతున్నాయి.. ఆదాయం మొదలైంది.
ఇసాక్ ముండా ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా ప్రతి నెలా కనీసం 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అతను తన వీడియోలను చిత్రీకరించడానికి కెమెరా, వాటిని సవరించడానికి ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశాడు. అంతే కాదు సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. తాను, తన కుటుంబం ఇలాంటి జీవితం గురించి కలలో కూడా ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశాడు. మన్ కీ బాత్‌లో ఇసాక్ ముండా విజయగాథను ప్రధాని మోదీ ప్రస్తావించి ప్రశంసించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..