మజ్జిగలో కరివేపాకు కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..? చర్మం నుంచి జుట్టు వరకు…

కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్లు సి, ఎ, బి, ఇ మొదలైనవి ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్లు. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడుతుంది. కరివేపాకు జుట్టు పెరుగుదల, చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. కరివేపాకు తినడం వల్ల గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. అయితే మీరు ఎప్పుడైనా కరివేపాకు మజ్జిగ తాగారా?

మజ్జిగలో కరివేపాకు కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..? చర్మం నుంచి జుట్టు వరకు...
Curry Leaves Mixed Buttermi
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 16, 2024 | 7:48 AM

మజ్జిగ మంచి సమ్మర్‌ డ్రింక్‌ అని మనందరికీ తెలుసు..! మజ్జిగను భోజనం తర్వాత, భోజనానికి ముందు, నిద్రపోయే ముందు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల సహజంగానే వేసవి ఎండల నుండి శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది. మజ్జిగ జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రోబయోటిక్. ఇది గట్‌లోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది. మజ్జిగలో ఇతర మూలికలు, మసాలా దినుసులు కలిపి తాగడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

కరివేపాకు ఎంత ఆరోగ్యకరమో కూడా మనందిరికీ తెలిసిందే.! కరివేపాకులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్లు సి, ఎ, బి, ఇ మొదలైనవి ఉంటాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్లు. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడుతుంది. కరివేపాకు జుట్టు పెరుగుదల, చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. కరివేపాకు తినడం వల్ల గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. అయితే మీరు ఎప్పుడైనా కరివేపాకు మజ్జిగ తాగారా? ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

కరివేపాకు మజ్జిగ రెసిపీ కోసం కావలసినవి..

ఇవి కూడా చదవండి

* 1 కప్పు పెరుగు

* 2 కప్పుల నీరు

* కరివేపాకు 2 రెమ్మలు

* 1 పచ్చిమిర్చి

* 1/2 టీస్పూన్ నల్ల మిరియాలు పొడి

* రుచికి కొద్దిగా ఉప్పు

మజ్జిగ చేసే విధానం..

మజ్జిగ రెసిపీ చేయడానికి, ముందుగా పెరుగును నీటితో కలిపి మజ్జిగ తయారు చేయండి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో కరివేపాకు, పచ్చిమిర్చి, నల్ల మిరియాలు, ఉప్పు వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఈ కరివేపాకు మిశ్రమాన్ని మజ్జిగలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు మజ్జిగ రెడీ. మరెందు ఆలస్యం వెంటనే ట్రై చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
స్పప్నకు సీమంతంతో రుద్రాణి ప్లాన్.. కావ్య, రాజ్‌లకు మరో షాక్!
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌.. ఓన్లీ డిజిటల్‌ పేమెంట్స్..
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
వచ్చే ఏడాది నుంచి ఇంటర్‌లో CBSE సిలబస్.. ఇంటర్‌ బోర్డు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..