AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చార్‌ధామ్‌ భక్తులకు శుభవార్త..! బద్రీనాథ్‌ ధామ్‌ తలుపులు తెరిచే తేదీ వెల్లడి… ఎప్పుడంటే..

భూ వైకుంఠంలో వెలసిన విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవడానికి వసంత పంచమి రోజున నిర్ణయించబడింది. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వసంత పంచమి సందర్భంగా నరేంద్ర నగర్‌ ప్యాలెస్‌లో ప్రత్యేక పూజల అనంతరం ఈ ప్రకటన చేశారు. మే 12న తెరుచుకోనున్న బద్రీనాథ్‌ ధామ్‌ ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ధామ్‌ను మే 12న తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ దేవాలయాల కమిటీ చైర్మన్‌ అజేంద్ర అజయ్‌ బుధవారం తెలిపారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి […]

చార్‌ధామ్‌ భక్తులకు శుభవార్త..! బద్రీనాథ్‌ ధామ్‌ తలుపులు తెరిచే తేదీ వెల్లడి... ఎప్పుడంటే..
Badrinath Dham
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2024 | 1:30 PM

Share

భూ వైకుంఠంలో వెలసిన విష్ణుమూర్తి నివాసమైన బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవడానికి వసంత పంచమి రోజున నిర్ణయించబడింది. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వసంత పంచమి సందర్భంగా నరేంద్ర నగర్‌ ప్యాలెస్‌లో ప్రత్యేక పూజల అనంతరం ఈ ప్రకటన చేశారు. మే 12న తెరుచుకోనున్న బద్రీనాథ్‌ ధామ్‌ ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ధామ్‌ను మే 12న తెరవనున్నట్లు బద్రీనాథ్‌-కేదార్‌నాథ్‌ దేవాలయాల కమిటీ చైర్మన్‌ అజేంద్ర అజయ్‌ బుధవారం తెలిపారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్రలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాట్లను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

చలికాలంలో పూజ్యమైన బద్రీనాథ్ ధామ్ మూసి ఉంటుంది. చమోలి జిల్లాలో ఉన్న బద్రీనాథ్ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌లతో పాటు చార్-ధామ్ అని పిలువబడే నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. ఆరు నెలల పాటు భక్తుల కోసం తెరిచి ఉంచుతారు.

2023లో నవంబర్ 18న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేసిన సంగతి తెలిసిందే. గతేడాది దాదాపు 16 లక్షల మంది భక్తులు బద్రి విశాల్‌ దర్శనం చేసుకోవటం రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరం కూడా ఈ సంఖ్య మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం, పరిపాలన వారి స్థాయిలో చార్ధామ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం, ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో మహాశివరాత్రి రోజున ఆచార వ్యవహారాలతో కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే తేదీని ప్రకటిస్తారు. తలుపులు తెరిచే తేదీకి సంబంధించిన ఆచారాలను వేలాది మంది భక్తులు వీక్షించారు. ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు అంటే మార్చి 8న తలుపులు తెరిచే తేదీని ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..