Watch Video: బాబోయ్.. ఇది పక్షి కాదు దెయ్యం..! దాని స్వరం వింటే ఊపిరి ఆగిపోవాల్సిందే..
రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తుంటాయి. బూడిద, గోధుమ రంగు ఈకలను కలిగి ఉంటాయి. ఇవి వాటి పరిసరాలతో కలిసిపోతాయి. పగటిపూట చెట్లపై కూర్చొని ఉంటే, వాటిని గుర్తుపట్టడం కష్టం.. అలా అవి తమను తాము రక్షించుకోవడానికి రంగును మారుస్తాయి. ఈ పక్షి చెట్ల మధ్య కూర్చుంటే ఎవరూ వాటిని గుర్తించలేరు. పొటూలు మాంసాహారులు..
Potoo Bird Facts: ప్రకృతిలోని ప్రతి జీవి తనకు తాను అద్భుతంగా ఉంటుంది. అలాంటి లక్షణాలు కలిగిన అనేక పక్షలు మన చుట్టూ కనిపిస్తాయి. ఇది వాటిని ఇతరుల నుండి భిన్నంగా చూపిస్తాయి. అటువంటి విభిన్నమైన పక్షి ఒకటి పొటూ. ఇది చూసేందుకు మాత్రం దెయ్యంలా కనిపిస్తుంది. అందుకే ఈ పక్షులను దెయ్యం పక్షులు అని కూడా అంటారు. రాత్రిపూట గుడ్లగూబలా కనిపించే ఈ పక్షి స్వరం వింటే గూస్‌బంప్స్ రావటం కాయం. ఈ పక్షిలో అనేక ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా ప్రత్యేకమైనవి. ఇప్పుడు ఈ పక్షి వీడియో వైరల్ అవుతోంది.
@gunsnrosesgirl3 అనే వినియోగదారు ద్వారా ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో Twitter)లో పోస్ట్ చేయబడింది. దీనిలో మీరు ఈ పక్షి ఎలా ఉంటుందో చూడవచ్చు. ఈ వీడియో నిడివి 30 సెకన్లు మాత్రమే.
The distinctive appearance of a potoo bird pic.twitter.com/GrxMOh9DQ4
— Science girl (@gunsnrosesgirl3) February 13, 2024
abcbirds.org నివేదిక ప్రకారం, పొటూ పక్షులు మెక్సికో, మధ్య దక్షిణ అమెరికా, కరేబియన్‌లో కనిపిస్తాయి. ఈ పక్షిలో ఏడు జాతులు ఉన్నాయి. జాతులపై ఆధారపడి, పోటూ పక్షులు ఎనిమిది అంగుళాల నుండి రెండు అడుగుల కంటే తక్కువ ఎత్తులో పెరుగుతాయి. పెద్ద కళ్ళు కాకుండా, ఈ పక్షుల ముఖ్య లక్షణాలు పెద్ద పొడవాటి తల, పొట్టి మెడలు, పొడవాటి శరీరాలు, పొట్టి, వంగిన ముక్కు కలిగి ఉంటుంది.
పొటూలు రాత్రిపూట ఎక్కువగా సంచరిస్తుంటాయి. బూడిద, గోధుమ రంగు ఈకలను కలిగి ఉంటాయి. ఇవి వాటి పరిసరాలతో కలిసిపోతాయి. పగటిపూట చెట్లపై కూర్చొని ఉంటే, వాటిని గుర్తుపట్టడం కష్టం.. అలా అవి తమను తాము రక్షించుకోవడానికి రంగును మారుస్తాయి. ఈ పక్షి చెట్ల మధ్య కూర్చుంటే ఎవరూ వాటిని గుర్తించలేరు. పొటూలు మాంసాహారం, బీటిల్స్, మిడతలు వంటి చిన్న చిన్న ఎగిరే కీటకాలను తింటాయి. అవి కొన్నిసార్లు గబ్బిలాలు, పక్షులను కూడా తింటాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..