AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teeth Whitening: మిళమిళ మెరిసే దంతాల కోసం ఇవి ట్రై చేయండి.. మీ పళ్లు ముత్యాలే..!

ఈ రెమెడీని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చిగుళ్లను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఉప్పు, నిమ్మకాయల మిశ్రమం కూడా చిగుళ్లను దృఢంగా మార్చుతుంది. ఈ చిట్కాలు పాటిస్తూ.. రోజుకు ఒకసారి చేస్తే గార పట్టిన పసుపు రంగులోకి మారిన దంతాలకు స్వస్తి చెప్పవచ్చు. ఈ రెమెడీని పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా, ఆక‌ర్ష‌ణీయంగా మారతాయి.

Teeth Whitening: మిళమిళ మెరిసే దంతాల కోసం ఇవి ట్రై చేయండి.. మీ పళ్లు ముత్యాలే..!
Teeth Whitening
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2024 | 10:16 AM

Share

తమ దంతాలు ముత్యాళ్ల తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తెల్లటి మెరిసే దంతాలు మనల్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. మెరిసే దంతాల కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. పసుపు దంతాలు కలిగిన వారు నలుగురిలో మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు మోహమాటపడుతుంటారు. అలాగే నలుగురిలో హాయిగా నవ్వనూ లేరు. మీరు కూడా పసుపు దంతాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇకపై అస్సలు చింతించకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు పాటిస్తే మీ దంతాలు తెల్లగా మెరవడమే కాదు దృఢంగా మారుతాయి.

ఉప్పు- ఆవాల నూనె..

తెల్లటి దంతాల కోసం ముందుగా ఒక చిన్న బౌల్‌ తీసుకుని అందులో 2 చిటికెల ఉప్పు వేసి, అందులో 5-6 చుక్కల ఆవాల నూనె ను వేసి బాగా మిక్స్‌ చేయాలి. దీన్ని మీ దంతాలు, చిగుళ్లపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత నీటితో బాగా కడిగేయండి.

ఇవి కూడా చదవండి

చిటికెడు ఉప్పు, నిమ్మరసం..

రెండు చిటికెల ఉప్పు తీసుకుని అందులో 5-6 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ దంతాల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత నీటితో బాగా కడిగేయండి.

చిగుళ్ళు బలంగా మారతాయి..

ఉప్పు, నూనెలో చిగుళ్లను బలోపేతం చేసే అంశాలు ఉంటాయి. ఈ రెమెడీని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చిగుళ్లను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఉప్పు, నిమ్మకాయల మిశ్రమం కూడా చిగుళ్లను దృఢంగా మార్చుతుంది.

ఈ చిట్కాలు పాటిస్తూ.. రోజుకు ఒకసారి చేస్తే గార పట్టిన పసుపు రంగులోకి మారిన దంతాలకు స్వస్తి చెప్పవచ్చు. ఈ రెమెడీని పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా, ఆక‌ర్ష‌ణీయంగా మారతాయి. ప‌సుపు దంతాల‌తో బాధ‌ప‌డే వారు త‌ప్ప‌కుండా ఈ రెమెడీని పాటించేందుకు ట్రై చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..