AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Non-Stick Pan: మీరు నాన్ స్టిక్ ప్యాన్లు వాడుతున్నట్లయితే ఈ చిట్కాలు మీకోసమే.. ! ట్రై చేసి చూడండి..

ఈ విధంగా, నాన్-స్టిక్ పాన్ ఉపయోగించడం వల్ల అవి ఎక్కువ కాలం ఉంటాయి. దీని కోసం మీరు మళ్లీ మళ్లీ కొత్త పాన్ కొనవలసిన అవసరం లేదు. ఈ చిట్కాలు పాటించి మీ ఖరీదైన నాన్‌స్టిక్‌ పాత్రలను కాపాడుకోండి.. లేదంటే మీరు కొన్న కొద్ది రోజులకే వాటిని మూలన పడేయాల్సి వస్తుంది. పాడై పోయిన నాన్ స్టిక్ పాన్ లో చేసిన వంటకాలు తినడం వల్ల

Non-Stick Pan: మీరు నాన్ స్టిక్ ప్యాన్లు వాడుతున్నట్లయితే ఈ చిట్కాలు మీకోసమే.. ! ట్రై చేసి చూడండి..
Non Stick Pan Clining
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2024 | 9:08 AM

Share

ఈ రోజుల్లో చాలా వరకు అందరి ఇళ్లలో నాన్-స్టిక్ పాన్, వంటపాత్రలనే ఉపయోగిస్తున్నారు. వీటి వాడకం వంటను సులభతరం చేస్తుంది. అందుకే చాలా మంది నాన్‌స్టిక్‌ పాత్రలనే వాడుతున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ ఈ నాన్ స్టిక్ పాత్రలు ఎక్కువ కాలం పనిచేయవు. దీంతో వండిన ఆహారం కూడా సరిగా ఉడకడం లేదు. దాంతో చిరాకు తప్పటం లేదు.. అందుకే నాన్‌స్టిక్‌ పాత్రలు ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చేయాలి..? ఈ చిట్కాలను ఉపయోగించడం ద్వారా నాన్ స్టిక్ పాన్ చాలా కాలం పాటు ఉపయోగించవచ్చు.

నాన్ స్టిక్ పాన్ చిట్కాలు: 

> ఎక్కువ మంట మీద నాన్ స్టిక్ పాన్ ఉపయోగించడం వల్ల త్వరగా పాడైపోతాయి. దానిపై టెప్లాన్ పూత సులభంగా కరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి

> తక్కువ మంట మీద నాన్ స్టిక్ పాన్ ఉపయోగించడం వల్ల పాన్ ఎక్కువకాలం పనిచేస్తుంది.

> నాన్ స్టిక్ పాన్ ఉపయోగించనప్పుడు వెంటనే నూనె పోయాలి.

> ఉపరితలానికి అంటుకునే ఆహారానికి నాన్-స్టిక్ పాన్‌లను మాత్రమే ఉపయోగించాలి.

> నాన్ స్టిక్ పాన్ ఉపయోగించేటప్పుడు ప్లాస్టిక్ లేదా చెక్క స్పూన్లను మాత్రమే ఉపయోగించండి.

> నాన్-స్టిక్ పాన్‌ను జెల్ సబ్బుతో మాత్రమే కడగాలి.

> నాన్ స్టిక్ పాన్ ను గట్టి స్పాంజితో రుద్దకూడదు.. ఇది పాన్‌ను పూర్తిగా నాశనం చేస్తుంది.

> నాన్ స్టిక్ పాన్ ను అతిగా వేడెక్కించవద్దు. లేకపోతే, టెఫ్లాన్ కరిగిపోతుంది. అది మీరు వండే ఆహారంలోకి కూడా చేరుతుంది.

ఈ విధంగా, నాన్-స్టిక్ పాన్ ఉపయోగించడం వల్ల అవి ఎక్కువ కాలం ఉంటాయి. దీని కోసం మీరు మళ్లీ మళ్లీ కొత్త పాన్ కొనవలసిన అవసరం లేదు. ఈ చిట్కాలు పాటించి మీ ఖరీదైన నాన్‌స్టిక్‌ పాత్రలను కాపాడుకోండి.. లేదంటే మీరు కొన్న కొద్ది రోజులకే వాటిని మూలన పడేయాల్సి వస్తుంది. పాడై పోయిన నాన్ స్టిక్ పాన్ లో చేసిన వంటకాలు తినడం వల్ల కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..