World’s Largest Economy: ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జర్మనీ.. త్వరలో భారత్.. !
జపాన్‌ను వెనక్కి నెట్టిన జర్మనీ.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. గత 14 ఏళ్లుగా మూడో స్థానంలో ఉన్న జపాన్..నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్థిక మాంధ్యం ప్రభావానికి లోనవుతున్న జపాన్‌ను వెనక్కి నెట్టి జర్మనీ మూడో స్థానంలో నిలిచింది. తాజా గణాంకాల మేరకు గత సంవత్సరం జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.9 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసుకుంది.
జపాన్‌ను వెనక్కి నెట్టిన జర్మనీ.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. గత 14 ఏళ్లుగా మూడో స్థానంలో ఉన్న జపాన్..నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్థిక మాంధ్యం ప్రభావానికి లోనవుతున్న జపాన్‌ను వెనక్కి నెట్టి జర్మనీ మూడో స్థానంలో నిలిచింది. తాజా గణాంకాల మేరకు గత సంవత్సరం జపాన్ ఆర్థిక వ్యవస్థ 1.9 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసుకుంది. గత ఏడాది జపాన్ 4.2 ట్రిలియన్ డాలర్ల వాస్తవిక జీడీపీ నమోదు చేసుకోగా.. జర్మనీ 4.4 ట్రినియన్ డాలర్లు నమోదు చేసుకుంది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం జపాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా జపాన్ పోటీతత్వాన్ని, ఉత్పాదకతను కోల్పోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే యెన్ విలువ పతనం కావడంతో జపాన్ ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే జపాన్ కరెన్సీ 2022లో దాదాపు 20 శాతం క్షీణించగా, 2023లో ఏడు శాతం పడిపోయింది.
ఒకప్పుడు అగ్ర రాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛాలెంజ్ చేసిన జపాన్.. ఇప్పుడు క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 1990ల నుంచి జపాన్ ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గింది. 2010 నాటి వరకు జపాన్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామణి అయ్యేది. అయితే ఆ దేశాన్ని చైనా వెనక్కి నెట్టి.. రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ పరిణామం జపాన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. ఇప్పుడు జపాన్ మరో స్థానాన్ని కోల్పోయి.. జర్మనీ కంటే దిగువున నాలుగో స్థానానికి పరిమితం అయ్యింది. యూరఫ్ దేశాల్లో జర్మనీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది. అయితే జర్మనీ ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటోంది.
పైపైకి దూసుకుపోతోన్న భారత్ ఆర్థిక వ్యవస్థ..
జపాన్, జర్మనీ ఆర్థిక వ్యవస్థలు నేలచూపులు చూస్తుండగా.. భారత్ ఆర్థిక వ్యవస్థ పైపైకి దూసుకుపోతోంది. కొన్నేళ్లలో జర్మనీ, జపాన్‌లను భారత్ వెనక్కే నెట్టి.. మూడో స్థానానికి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ల తర్వాత ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. జర్మనీలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఆర్థిక వృద్ధి నిలిచిపోయింది. జపాన్, జర్మనీ జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. సహజ వనరులు తగ్గుతున్నాయి. ఆ రెండు దేశాలు కార్ల ఎగుమతిలో కఠినమైన పోటీని ఎదుర్కొంటున్నారు. IMF డేటా ప్రకారం, భారతదేశం 2026లో జపాన్‌ను, 2027లో జర్మనీని అధిగమించగలదని అంచనా. కానీ జపాన్ , జర్మనీల్లో నెలకొన్న ప్రతికూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారత్ త్వరలోనే ఈ దేశాలను అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అగ్రస్థానంలో నిలుస్తోన్న అమెరికా..
ఫోర్బ్స్ ప్రకారం, అమెరికా ప్రస్తుతం 27.974 ట్రిలియన్ల డాలర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 18.566 ట్రిల్లియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలుస్తోంది. 4.730 ట్రిల్లియన్ డాలర్లతో జర్మనీ మూడో స్థానంలో, 4.291 ట్రిల్లియన్ డాలర్లతో జపాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి. భారతదేశం 4.112 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది.