AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: శోభనం రోజున వయాగ్రా తీసుకుని విపరీత శృంగారం.. ప్రాణాలు కోల్పోయిన వధువు

శోభనం రోజు కామోద్దీపనలు పెంచే వయాగ్రాను వేసుకున్న వరుడు.. బాధితురాలిపై రాక్షసంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తీవ్ర రక్త స్రావంతో విలవిల్లాడిపోయింది. తీవ్ర ఇన్ఫెక్షన్‌‌‌తో ఆస్పత్రిలో చేరింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది.

Viral: శోభనం రోజున వయాగ్రా తీసుకుని విపరీత శృంగారం.. ప్రాణాలు కోల్పోయిన వధువు
Viagra (Credit: iStock Photo)
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2024 | 11:39 AM

Share

ఎన్నో కలలతో మెట్టింట అడుగుపెట్టిన ఆమెకు తొలి రాత్రే కాళ రాత్రిగా మారింది. భర్త ఆటవిక చర్యకు బలైపోయింది. తొలిరాత్రి భర్త వయాగ్రా మాత్ర వేసుకుని శృంగారంలో పాల్గొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సదరు యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విచక్షణ లేకుండా, అత్యంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించి.. ఆమె ప్రాణాలు తీసేశాడు సదరు యువకుడు. తీవ్ర రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్‌తో 3 రోజుల పాటు నరకం చూసిన బాధితురాలు చివరకు కన్నుమూసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో చోటుచేసుకుంది. 

హమీర్‌పూర్‌కు చెందిన ఇంజినీర్‌కు ఫిబ్రవరి 3న వివాహం జరిగింది. ఫస్ట్ నైట్ సందర్భంగా వయాగ్రా మాత్ర వేసుకున్నాడు వరుడు. దీంతో ఆమె ప్రయివేట్ భాగాల్లో తీవ్ర గాయాలై.. రక్తస్రావం, తీవ్ర ఇన్ఫెక్షన్‌‌‌తో అస్వస్థతకు గురైంది. ఆపై ఆరోగ్యం చాలా క్షీణించింది.  దీంతో కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో చేరింది. ఎంత చికిత్స చేసినా డాక్టర్లు ఆమెను కాపాడలేకపోయారు. నవ వధువు ఫిబ్రవరి 7న ఆసుపత్రిలో చేరగా, చికిత్స విఫలం కావడంతో ఫిబ్రవరి 10వ తేదీ శనివారం మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. సామూహిక అత్యాచారం చేసినంత దారుణంగా బాధితురాలి పరిస్థితి ఉందని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్‌ తెలిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మృతురాలి బంధువులు ఇప్పటికే పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. భర్త, అతని కుటుంబసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వరుడు.. తన తల్లిదండ్రులతో కలిసి పరారయ్యాడు.

అయితే కొత్వాలి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి సమాచారం/ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందిన తర్వాత విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హమీర్‌పూర్ పోలీసులు తెలిపారు. 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి