AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day 2024: ఈ పక్షి ప్రేమ పవిత్రమైనది..! రామాయణంతో ముడిపడిన బంధం.. ఆ త్యాగం ఏమిటంటే..

ఈ పక్షిపవిత్రమైన ప్రేమకు చిహ్నంగా చెబుతారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి. దీనితో పాటు, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా దీనిని పవిత్ర పక్షిగా భావిస్తారు. గోండు కులాల ప్రజలు దీనిని పంచ దేవతలుగా పూజిస్తారు. ఈ పక్షితో రామాయణానికి దగ్గర సంబంధం కూడా ఉంది.

Valentine’s Day 2024: ఈ పక్షి ప్రేమ పవిత్రమైనది..! రామాయణంతో ముడిపడిన బంధం.. ఆ త్యాగం ఏమిటంటే..
Saras Bird
Jyothi Gadda
|

Updated on: Feb 14, 2024 | 1:29 PM

Share

Valentine’s Day 2024: వాలెంటైన్స్ డే అంటే ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు..అన్ని ప్రేమ వార్తలే కనిపిస్తాయి. ఇక వాలంటైన్స్ డే కు వారం ముందు నుంచే వాతావరణం అంతా ప్రేమమయంగా మారుతుంది. ఈ రోజున, ప్రేమలో ఉన్న వ్యక్తులు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. కలిసి జీవించడానికి మరణించడానికైనా సిద్ధమేనంటూ ప్రతిజ్ఞలు చేసుకుంటారు. కానీ ప్రేమకు ఖచ్చితమైన ఉదాహరణ ఇస్తే, అందులో కొంగ పేరును ముందు వరుసలో నిలుస్తుంది.

కొంగను పవిత్రమైన ప్రేమకు చిహ్నంగా చెబుతారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి. దీనితో పాటు, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా దీనిని పవిత్ర పక్షిగా భావిస్తారు. గోండు కులాల ప్రజలు కొంగను పంచ దేవతలుగా పూజిస్తారు. కొంగకు రామాయణానికి దగ్గర సంబంధం కూడా ఉంది.

కొంగను ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు..ఇది అంకితభావానికి చిహ్నం. కొంగలు సంబంధం, బలం, ప్రేమ, అంకితభావాన్ని బాగా వివరిస్తాయి. కొంగలు తమ భాగస్వాములను ఎక్కువగా ప్రేమిస్తాయి. ఎల్లప్పుడూ జంటగా ఎగరడానికే ఇష్టపడతాయి. వాటి మధ్య ప్రేమ ఎంతో గాఢమైనది. ఒక కొంగ ఏదైనా కారణం వల్ల చనిపోతే, మరొకటి తట్టుకోలేదు. చనిపోయిన కొంగ కోసం తిండి నీళ్లు మానేసి చివరకు అది కూడా ప్రాణాలు వదిలిపెడుతుంది. అందుకే ఈ పక్షి ప్రేమ కూడా మనుషులకు తీసి పోదని చెబుతారు.

ఇవి కూడా చదవండి

కొంగకు రామాయణానికి ఉన్న సంబంధం..

కొంగ చరిత్ర రామాయణానికి సంబంధించినది. క్రేన్ పక్షి వర్ణనతో వాల్మీకి రామాయణం రాయడం ప్రారంభిస్తాడు. ఒక వేటగాడు కొంగ జంటలలో ఒకదానిపై బాణం వేసి హతమారుస్తాడు.. దాంతో మిగిలిన మరో కొంగ కూడా తన జీవితాన్ని బాధతో ముగించుకుంటుంది. ఈ సంఘటనతో చలించిన మహర్షి వేటగాడిని శపిస్తాడు. ఈ పంక్తులు రామాయణంలో మొదటి శ్లోకంగా వ్రాయబడ్డాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఊహలు, ఇంటర్‌నెట్‌ సమాచారంపై ఆధారపడి అందించబడింది. ఏ సమాచారాన్ని ఆమోదించదు.. లేదా నిర్ధారించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..