AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS IPS Village: వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ..! 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..

ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు?! అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు..ప్రతి ఇంట్లో ఒక IAS, IPS ఉంటారు.. కాబట్టి దీనిని IAS ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అందుకే ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

IAS IPS Village: వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ..! 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే..
Ias Ips Village
Jyothi Gadda
|

Updated on: Feb 14, 2024 | 10:59 AM

Share

IAS, IPS అధికారులు కావాలంటే UPSC పరీక్షలో విజయం సాధించాలి. కానీ, ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులువైనది కాదు.. అదొక పెద్ద భయంకరమైన యజ్ఞం.. చాలా మంది విద్యార్థులు ఈ UPSC పరీక్షలను ఛేదించడానికి సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు. ఆ తర్వాత కూడా చాలా మంది కోరుకున్న ర్యాంక్‌ను సాధించడంలో సక్సెస్‌ కాలేకపోతుంటారు. దాంతో అందివచ్చిన ఏదో ఒక అవకాశాన్ని అందుకుని లైఫ్‌లో సెటిల్‌ అవుతుంటారు. కానీ, ఒక ఊరిలో మాత్రం ఇంటికో IAS, IPS అధికారి ఉన్నారు. ఇది కేవలం 75 ఇండ్లు మాత్రమే ఉన్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులు ఉన్నారు. అది ఏ ఊరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటివరకు దాదాపు 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ మాధోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్, ఐపీఎస్ లను అందించింది. అందుకే ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం. ఇంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేసిన ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు?! అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు..ప్రతి ఇంట్లో ఒక IAS, IPS ఉంటారు.. కాబట్టి దీనిని IAS ఫ్యాక్టరీ అని పిలుస్తారు. దీంతో భారతదేశంలో సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచింది.

ఈ గ్రామం ‘IAS ఫ్యాక్టరీ’గా పేరు పొందింది. ప్రతియేటా ఉన్నత అధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జౌన్‌పూర్ జిల్లాలోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్‌లు లేవు. కాబట్టి, ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది..! ఇక స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు , నీలం లైట్ల వచ్చే కార్లతో రద్దీగా మారుతుంటాయి.

ఇవి కూడా చదవండి

మాధోపట్టి గ్రామం విద్యకు కేంద్రంగా నిలుస్తుంది. ఈ గ్రామం నుండి వచ్చిన చాలా మంది అధికారులు అంతరిక్షం, అణు పరిశోధన, న్యాయ సేవలు, బ్యాంకింగ్‌లో ఉన్నత స్థాయి వృత్తుల్లో స్థిరపడిఉన్నారు. వినయ్ కుమార్ సింగ్, ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ అనే నలుగురు IAS తోబుట్టువులకు ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది.

ఈ గ్రామ సాహసానికి కూడా నెలవు.. చరిత్ర కోసం వెనక్కి తిరిగి చూస్తే, స్వాతంత్ర్య సమరయోధుడు ఠాకూర్ భగవతి దిన్ సింగ్, అతని భార్య శ్యామరాతి సింగ్ 1917లో గ్రామంలో పిల్లలను చదివించడం ప్రారంభించారని చెబుతారు. మొదట్లో శ్యామరాతి అమ్మాయిలకు పాఠాలు నేర్పించడం ప్రారంభించింది. త్వరలో అబ్బాయిలకు కూడా నేర్పించడం మొదలుపెట్టింది. సంవత్సరాల క్రితం నాటిన అభ్యాస స్ఫూర్తి ఈ గ్రామ ప్రజల జీవనశైలిలో కలిసిపోయి నేటికీ కొనసాగుతూ వస్తోందని గ్రామస్తులు చెబుతారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..