Watch Video: ఆహా.. ఏం ఐడియా గురూ.. “పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్” తయారీ విధానం చూస్తే అవాక్కే!

ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది మరింత మందిని ఆకర్షిస్తూ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వీడియోని ఫుడ్‌ వ్లాగర్‌ వెరైటీగ్‌ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్‌ పెట్టి మరీ పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇదిపై విపరీతమైన రియాక్షన్స్ ఇస్తున్నారు.

Watch Video: ఆహా.. ఏం ఐడియా గురూ.. పేపర్ బ్యాగ్ ఫ్రైడ్ చికెన్ తయారీ విధానం చూస్తే అవాక్కే!
Paper Bag Fried Chicken
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 14, 2024 | 8:56 AM

సోషల్‌ మీడియా పుణ్యమా! అని పొద్దున లేస్తే.. ఎన్నో రకాల వీడియోలు ఇంటర్‌నెట్‌లో కనిపిస్తున్నాయి. నిద్రలేవగానే ఏం చేయాలి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? ఇంటి వాస్తు, పూజా విధానాలు, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి ఇలా ఎన్నో రకాల వార్తలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా జనాలు ఇట్టే తెలుసుకుంటున్నారు. ఇకపోతే, ఇటీవల కాలంలో ఎక్కువగా వంటలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. పల్లెలు మొదలు పట్టణాల వరకు వంటలపై ఆసక్తి ఉన్నవారు తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు.

అలాగే, వివిధ రకాల వంటకాల గురించి అందరూ క్షణాల్లో తెలుసుకుంటున్నారు. వండేస్తున్నారు కూడా. అలాంటి వంటకానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇంతవరకు ఎన్నో వెరైటీ రెసీపీలు చేసే విధానాన్ని చూసే వింటారు. ఇక్కడ ఒక వ్యక్తి చేస్తున్న వంటకం స్టైల్ మాత్రం అస్సలు చూసుండరు. అది చూస్తే మాత్రం మీరు కూడా విస్తుపోతారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా చికెన్‌ ఫ్రై అంటే.. చికెన్ ముక్కలు చక్కగా మసాల పొడుల్లో మేరినేషన్ చేసుకుని ఓ గంటపాటు ఆగిన తర్వాత డీప్‌ ఫ్రై చేసుకుని లాగించేస్తాం. ఇది అందరికీ తెలిసిందే.. కానీ, వైరల్‌ వీడియోలో వ్యక్తి చేసిన చికెన్‌ ఫ్రై అలా లేదు.. అతడు ముందుగా అల్లం వెల్లుల్లి, కొన్ని రకాల మసాల పొడులతో చికెన్‌ని మేరినేషన్‌ చేశాడు.. ఆ తరువాత దాన్ని పేపర్‌ బ్యాగ్‌లో ప్యాక్‌ చేశారు. అలా ఒక్కో చికెన్‌ ముక్కను పేపర్‌ బ్యాగ్‌లో పిన్‌ చేసి నేరుగా డీప్‌ ఫ్రై చేసేస్తున్నారు. ఇలా చేస్తే ఏం కాదా? అని అవాక్కవ్వకండి. ఎందుకంటే అది పేపర్‌ బ్యాగ్‌ కాబట్టి చక్కగా చికెన్‌ ఆ పేపర్‌ తోపాటు వేగిపోతుంది. పైగా దాన్ని ఓపెన్‌ చేయగానే చికెన్‌లో ఉన్న మసాలాలు జ్యూసీగా వస్తాయి. ఇలా చేయడం వల్ల మసాలా చికెన్‌ నుంచి వేరవ్వకుండా దానికే ఉంటుంది. దాంతో పాటు టేస్ట్‌కి టేస్టు ఉంటుంది.

వైరల్‌గా మారిన ఈ వీడియో మలేషియాకు చెందినదిగా తెలిసింది. మలేషియా వీధుల్లో తినుబండారాలు అమ్మే వ్యక్తి ఇలా డిఫరెంట్‌ స్టైల్‌లో చికెన్‌ చేస్తూ కనిపించాడు. దాంతో అందరి దృష్టి అతడు తయారు చేసిన విధానంపైనే పడింది. ఇదంతా వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది మరింత మందిని ఆకర్షిస్తూ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. వీడియోని ఫుడ్‌ వ్లాగర్‌ వెరైటీగ్‌ ఫ్రై చేస్తున్న ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా అనే క్యాప్షన్‌ పెట్టి మరీ పోస్టు చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. కాగితంలో ఉండే రసాయానాలు అలా డీప్‌ ఫ్రై చేసినప్పుడు ఆ చికెన్‌లోకి వెళ్లిపోతాయి. తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదురవ్వుతాయంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్ట్‌లు పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!