AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic Water Bottles: అమ్మ బాబోయ్.. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా..? ఇక ‘ఆ మ్యాటర్‌’లో జీరోనే బాస్..

నీరు మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకం.. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో మనం తీసుకునే నీళ్లు కూడా అంతే ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని సూచిస్తున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో అంతా ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని ఎక్కువగా తాగుతున్నారు. నీరు త్రాగే ప్లాస్టిక్ సీసాలు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Plastic Water Bottles: అమ్మ బాబోయ్.. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా..? ఇక ‘ఆ మ్యాటర్‌’లో జీరోనే బాస్..
Plastic Water Bottles
Shaik Madar Saheb
|

Updated on: Feb 14, 2024 | 3:08 PM

Share

నీరు మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకం.. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో మనం తీసుకునే నీళ్లు కూడా అంతే ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని సూచిస్తున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో అంతా ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని ఎక్కువగా తాగుతున్నారు. నీరు త్రాగే ప్లాస్టిక్ సీసాలు మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనవని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి, మనం మంచి ఆహారం తీసుకుంటాము.. వ్యాయామం చేస్తాము. కానీ మన రోజువారీ జీవితంలో మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగించే అనేక తప్పులు చేస్తాము. చాలామంది చేసే పొరపాట్లలో ఒకటి ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించడం. మన ఇంట్లో, ఆఫీసులో ప్రతిచోటా వాటర్ బాటిళ్లను ఉపయోగిస్తారు. ఈ బాటిళ్లు చాలా వరకు ప్లాస్టిక్‌తో తయారు చేసినవి.. ఎందుకంటే అవి ఇతర వస్తువులతో పోలిస్తే చౌకనవి.. మన్నికైనవి. అందుకే.. మనం రోజూ బాటిళ్లను ఉపయోగిస్తాము. చాలా రోజులు అవుతున్నా.. కూడా మనం వాటిని పక్కకు పడేయకుండా.. నీరు నింపి మరి ఉపయోగిస్తాము. వాటిని ఉపయోగించే క్రమం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అయితే మీరు రోజూ వాడే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ మీ ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తున్నాయో తెలుసా? తెలియకపోతే.. ఈ స్టోరీని పూర్తిగా చదవండి..

ప్లాస్టిక్ బాటిళ్లు ఎలా తయారు చేస్తారు?

ఈ ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేయడానికి, ప్లాస్టిక్ పౌడర్ అంటే మైక్రోప్లాస్టిక్‌లను ఉపయోగిస్తారు. ఈ మైక్రోప్లాస్టిక్‌లు చాలా చిన్నవి.. ఎంతంటే.. మన కంటికి కూడా కనిపించవు.. ఈ మైక్రోప్లాస్టిక్‌లు 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే చిన్న కణాలు, ఇవి మన నీటిలో కరిగిపోతాయి. ఈ ప్లాస్టిక్ సీసాలు ప్రతిసారీ నీటిలో కరిగిపోయే మైక్రోప్లాస్టిక్‌లను విడుదల చేస్తూనే ఉంటాయి. వేడి నీటి వాడకం, ఈ మైక్రోప్లాస్టిక్‌లు, రసాయనాలు నీటిలో వేగంగా కరిగిపోయి మన ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని చాలా పరిశోధనలలో వెల్లడైంది.

ఈ మైక్రోప్లాస్టిక్స్ చాలా ప్రమాదకరమైనవి..

మనం ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగినప్పుడు, మనకు తెలియకుండానే ఈ మైక్రోప్లాస్టిక్‌లను తీసుకుంటాం.. అనేక అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా బాటిల్ వాటర్ శాంపిల్స్‌లో మైక్రోప్లాస్టిక్ కణాలను గుర్తించాయి. ఈ కలుషిత నీటి నుండి సంభావ్య ఆరోగ్య సమస్యల గురించి ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ మైక్రోప్లాస్టిక్‌లతో పాటు, ఈ సీసాలు అనేక రకాల రసాయనాలను కూడా విడుదల చేస్తాయి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ రసాయనాలు ఎలాంటి వ్యాధుల ప్రమాదాలను పెంచుతాయో తెలుసుకోండి..

  • ఈ మైక్రోప్లాస్టిక్స్, రసాయనాల లీకేజ్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది
  • ఇన్సులిన్ నిరోధకత
  • బరువు పెరగడం
  • వంధ్యత్వం
  • చర్మ క్యాన్సర్
  • టెన్షన్

ఈ ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి

ఈ వ్యాధులను నివారించడానికి, మేము ప్లాస్టిక్‌కు బదులుగా స్టెయిన్‌లెస్ స్టీల్, గాజు, BPA లేని ప్లాస్టిక్‌తో చేసిన బాటిళ్లను ఉపయోగించవచ్చు. దీనితో మనం ప్లాస్టిక్ కాలుష్యం నుండి మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!