AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రైస్ డైట్ ఫాలోకండి

మన ఇండియన్స్ చాలామంది ఆహారంగా రైస్ ను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే రైస్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్వల బరువు పెరగడానికి,  కొవ్వుకు దారితీస్తుందని కొంతమంది మీల్స్ కు దూరంగా ఉంటారు.

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రైస్ డైట్ ఫాలోకండి
Dinner
Balu Jajala
|

Updated on: Feb 14, 2024 | 3:12 PM

Share

మన ఇండియన్స్ చాలామంది ఆహారంగా రైస్ ను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే రైస్ ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి,  కొవ్వుకు దారితీస్తుందని కొంతమంది మీల్స్ కు దూరంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్లకు పైగా ప్రజలకు బియ్యం ప్రధాన ఆహారం. అనేకమంది మహిళలు పిండి పదార్ధాలుగా వీటిని వాడతారు. అయితే WebMD ప్రకారం.. గుండె జబ్బులు,  రక్తపోటును నివారించడానికి బియ్యం ఆహారం ఒక గొప్ప మార్గం. ఇది రక్తపోటును పరిమితం చేయడానికి సహాయపడుతుంది.

రైస్ ను తినడం వల్ల చాలామంది బరువు పెరుగుతున్నాని అనుకుంటున్నారు. అయితే అలాంటివాళ్లు  రైస్ డైట్ ఫాలోకావొచ్చు. దీని వల్ల  బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. 2014  కోహోర్ట్ నివేదిక ప్రకారం, రైస్ డైట్ వల్ల వేగంగా, సురక్షితంగా బరువు తగ్గవచ్చని స్పష్టం చేసింది. పురుషులలో, మొదటి నాలుగు వారాలలో సగటున 30 పౌండ్లు కనిపించాయి. ఆడవారు సగటున 19 పౌండ్లు కోల్పోయారు. బరువు తగ్గడమే కాకుండా, అన్నం ఎవరినైనా శక్తివంతం చేస్తుందని నివేదిక పేర్కొంది.

ఆహారాలలో రైస్ డైట్ కు మించిది లేదు. దీని ద్వారా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినవచ్చు. బరువు తగ్గడానికి ఉత్తమ డైట్ ఇదేనని చెబుతున్నారు. మీరు రైస్ డైట్ పద్ధతిని ప్రయత్నించడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే, మీకు ఏవైనా వైద్య పరిస్థితులు ఉంటే ప్రత్యేకంగా అనుసరించడం ప్రారంభించే ముందు మీరు తప్పనిసరిగా మీ పోషకాహార నిపుణుడు లేదా వైద్యుడిని సంప్రదించాలి. భారతీయులు చాలామంది వరిని ఆహారంగా తీసుకోవడం అలవాటు. అయితే దీని వల్ల పోషకాలు కూడా అంతంత మాత్రమే. చాలా త్వరగా బరువు పెరుగుతున్నట్టు కూడా పలు సర్వేల్లో తేలింది. అలాంటివాళ్లు కచ్చితంగా రైస్ డైట్ ఫాలో అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చు.