AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Foods: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పదార్థాలను తీసుకోవాల్సిందే!

వాతావరణంలోని పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉండే కొద్దీ ఉష్ణోగ్రతలు ఇంకా మార్పు వస్తుంది. వడ దెబ్బ కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలోనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మొదటి నుంచే ఆరోగ్య పరంగా మీరు కొన్ని రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోక తప్పదు. ఈ రకమైన ఆహారలు మిమ్మల్ని..

Summer Foods: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ పదార్థాలను తీసుకోవాల్సిందే!
Summer Foods
Chinni Enni
|

Updated on: Feb 14, 2024 | 6:45 PM

Share

వాతావరణంలోని పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉండే కొద్దీ ఉష్ణోగ్రతలు ఇంకా మార్పు వస్తుంది. వడ దెబ్బ కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలోనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మొదటి నుంచే ఆరోగ్య పరంగా మీరు కొన్ని రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోక తప్పదు. ఈ రకమైన ఆహారలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా రోగాలతో పోరాడేందుకు ఇమ్యూనిటీ లెవల్స్‌ను పెంచుతాయి. మరి వేసవి కాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.

తేలికగా ఉండే ఆహారాలు తీసుకోవాలి:

వేసవి కాలంలో తేలికగా ఉండే ఆహారాలు, త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చలి కాలంలో తీసుకునే వేడి వేడి ఆహారాలు.. వేసవి కాలంలో తీసుకోకూడదు. అలాగే అధిక కొవ్వు, నూనెలతో తయారు చేసే వంటలు కూడా తీసుకోకుండా ఉండాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది. వడ దెబ్బ కూడా తగలకుండా ఉంటుంది.

నీటి శాతం ఉండే ఆహారాలు తీసుకోవాలి:

వేసవి కాలంలో చల్లగా, నీటి శాతం మెండుగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎండ దెబ్బ కూడ తగలకుండా ఉంటుంది. అదే విధంగా నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, బచ్చలి కూర, పొన్న గంటి కూర, పాల కూర వంటి ఆకు కూరలు తీసుకోవడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

చెరుకు రసం:

డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటే చెరుకు రసం తాగడం చాలా ముఖ్యం. చెరుకు రసం తాగినా.. చెరకు ముక్కలు తిన్నా డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. అలాగే నిమ్మ రసంతో చేసిన పానీయాలు కూడా తాగుతూ ఉండాలి. ఉదయం గోరు వెచ్చటి పాలల్లో అటుకులు వేసి తినడం వల్ల కడుపు అనేది చల్లగా ఉంటుంది.

బార్లీ వాటర్:

అదే విధంగా బార్లీ గింజల్లో నీళ్లు పోసి ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని తాగితే చాలా మంచిది. ఎలాంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. చిన్న పిల్లలకు పట్టిస్తే వడ దెబ్బ, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారు. అలాగే టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోకూడదు. మంచి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!