AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Tips: గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

గర్భిణీ తమ మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో హార్మోన్లు, శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు పెరుగుతుంది. ఇది గర్భధారణ సమయంలో అస్సలు మంచిది కాదు. అందుకు ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది.

Pregnancy Tips: గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!
Pregnancy Tips
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2024 | 11:43 AM

Share

Pregnancy Tips: గర్భం అనేది ప్రతి మహిళకు ఎంతో సంతోషకర సమయం. ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు, అది ఆమె జీవితంలో అత్యంత అందమైన క్షణం. గర్భధారణ సమయంలో మహిళలు తమ రాబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటారు. ఈ సమయంలో మహిళలు ఒత్తిడి, అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో స్త్రీల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారికి అదనపు జాగ్రత్తలు అవసరం. ఈ సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అందులోనూ గర్భం దాల్చిన మొదటి మూడు నెలల కాలం అత్యంత సున్నితమైనది. అందుకే గర్భిణీలు ఈ సమయంలో కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి.

గర్భం దాల్చిన వారు భారీ వ్యాయామాలకు దూరంగా ఉండాలి. గర్భం దాల్చినంత మాత్రాన వ్యాయామం పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. బాగా అలిసిపోయే వ్యాయామాలకు బదులు వాకింగ్‌, యోగాలాంటి సౌకర్యవంతమైన వ్యాయామాలు చేయటం మంచిది. వ్యాయామం చేసే శక్తి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. దాని ఆధారంగా చేయగలిగేంతవరకే వ్యాయామం చేయాలి. శక్తికి మించిన వ్యాయామం వల్ల గర్భస్రావం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి, గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు తేలికపాటి వ్యాయామం మాత్రమే చేయండి.

గర్భిణీ తమ మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో హార్మోన్లు, శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి. అటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు పెరుగుతుంది. ఇది గర్భధారణ సమయంలో అస్సలు మంచిది కాదు. అందుకు ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

గర్భధారణ సమయంలో మీరు ప్రశాంతంగా సరిగ్గా నిద్రపోవాలి. నిద్ర లేకపోవడం, నిద్రలేమి మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో మీరు ఎక్కువగా అలసిపోతారు. అందువల్ల ఆరోగ్యకరమైన నిద్ర చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..