Spiritual: ఉదయం లేవగానే అద్దాన్ని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఉదయం లేవగానే అదృష్టాన్ని, లక్‌ని కలిసొచ్చే వస్తువులు చూడాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉదయం లేవగానే ఏది పడితే అది చూడకూడదని అంటూ ఉంటారు. దాని వల్ల దరిద్రం అని కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరూ వీటని పట్టించుకోవడం లేదు. అలా పెద్దలు చెప్పడానికి కారణం లేకపోలేదు. ఉదయం లేవగానే చాలా మందికి అద్దాన్ని చూసే అలవాటు ఉంటుంది. అద్దంలో ముఖాన్ని చూసుకుని, జుట్టును సరి చేసుకుని ఆ తర్వాతే బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఇలా నిద్ర లేచిన వెంటనే..

Spiritual: ఉదయం లేవగానే అద్దాన్ని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Spiritual
Follow us
Chinni Enni

|

Updated on: Feb 15, 2024 | 1:15 PM

ఉదయం లేవగానే అదృష్టాన్ని, లక్‌ని కలిసొచ్చే వస్తువులు చూడాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉదయం లేవగానే ఏది పడితే అది చూడకూడదని అంటూ ఉంటారు. దాని వల్ల దరిద్రం అని కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరూ వీటని పట్టించుకోవడం లేదు. అలా పెద్దలు చెప్పడానికి కారణం లేకపోలేదు. ఉదయం లేవగానే చాలా మందికి అద్దాన్ని చూసే అలవాటు ఉంటుంది. అద్దంలో ముఖాన్ని చూసుకుని, జుట్టును సరి చేసుకుని ఆ తర్వాతే బయటకు వెళ్తూ ఉంటారు. కానీ ఇలా నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకోవడం వల్ల.. రోజంతా పాడవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఉదయం లేవగానే అద్దాన్ని చూడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

నెగిటివ్ ఎనర్జీ:

ఉదయం లేవగానే అద్దం చూడటం వల్ల నెగిటివ్ ఎనర్జీ.. శరీరంలోకి ప్రవేశిస్తుందట. దీని వల్ల మీ రోజంతా డల్‌గా, నిరుత్సాహంగా ఉంటారు. ఏ పని చేసినా.. అది పూర్తి కాదు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే అద్దాన్ని చూడకండి.

శరీరంపై చెడు ప్రభావం:

ఉదయం లేవగానే అద్దంలో మీ ముఖాన్ని, శరీరాన్ని చూసుకోవడం వల్ల చెడు ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దీనివల్ల జీవితంలో సంక్షోభాలను కూడా ఎదుర్కొంటారట.

ఇవి కూడా చదవండి

వ్యక్తుల నీడను కూడా చూడకూడదు:

అద్దాల్లో ఇతర వ్యక్తుల నీడను కూడా చూడకూదట. ఇలా చూడటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నెలకొంటుందట. అంతే కాదు అశుభంంగా కూడా భావిస్తారు.

అద్దాన్ని ఎప్పుడు చూడాలి:

పురాణాల ప్రకారం అద్దాన్ని ఉదయం లేచిన వెంటనే అస్సలు చూడ కూడదు. మార్నింగ్ కాలకృత్యాలు తీర్చుకుని ముఖం శుభ్రం చేసుకుని లేదా స్నానం చేసిన తర్వాత అద్దాన్ని చూడాలని జోతిష్య శాస్త్రం చెబుతుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ, దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలంటే.. ఉదయాన్నే అద్దాన్ని చూడటం మానుకోండి.

ధ్యానం చేసుకోవాలి:

ఉదయం లేవగానే ధ్యానం చేసుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఏకాగ్రత లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి