AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా కుంభాభిషేకానికి ముస్తాబవుతున్న శ్రీశైలం, 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే వేడుక ఇది!

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పవిత్రమైన మహా కుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీశైలం సిద్ధమైంది. తొలుత గత ఏడాది మేలో జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం ఆచార వ్యవహారాల పరంగా తిరుమలను పోలి ఉంటుంది.

మహా కుంభాభిషేకానికి ముస్తాబవుతున్న శ్రీశైలం, 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే వేడుక ఇది!
Srisailam
Balu Jajala
|

Updated on: Feb 15, 2024 | 11:29 AM

Share

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పవిత్రమైన మహా కుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీశైలం సిద్ధమైంది. తొలుత గత ఏడాది మేలో జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భక్తుల రద్దీ, రోజువారీ ఆచార వ్యవహారాల పరంగా తిరుమలను పోలి ఉంటుంది. ముఖ్యమైన సందర్భాలు, సెలవులు, ఇతర పవిత్ర దినాలలో ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. దీంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తున్నారు. ఉత్సవ కలశాల నుండి పవిత్ర జలం చిలకరించే ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ పండుగ సాంప్రదాయకంగా హిందూ దేవాలయాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమేం ఆలయం నిర్వహిస్తుంటుంది. ఆధ్యాత్మిక శక్తిని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాని నిర్వహిస్తారు.

శ్రీశైలం దేవస్థానం మొదట మే 2023లో ఆచారాన్ని ప్లాన్ చేసింది. ఏర్పాట్ల కోసం సుమారు రూ. 3 కోట్లు ఖర్చు చేసింది. వేద పండితులు సాంప్రదాయ కార్యక్రమానికి తేదీలను సూచించారు. కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆలయం మహా కుంభాభిషేకం నిర్వహించాలని నిర్ణయించింది. కానీ ఇంకా తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. శైవ సంప్రదాయం ప్రకారం.. శివాలయాలు ఆచారాలను ఎలా నిర్వహించాలో, ఆలయ సంప్రదాయాలను ఎలా అనుసరించాలో సూచనల కోసం కంచి, శృంగేరి పూజారులను సంప్రదించాల్సి ఉంది. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున సంబంధిత మంత్రి, ఇతరులను ఆహ్వానించడానికి ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా పూజలు పూర్తి చేయాలని ఆలయ అధికారులు యోచిస్తున్నారు.

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ఆలయ సందర్శనకు ప్లాన్ చేసుకున్నారని, అయితే షెడ్యూల్స్ కారణంగా వాయిదా పడిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమ తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నామని ఆలయ అధికారి ఒకరు తెలిపారు. 12 ఏళ్ల తర్వాత ఒకసారి మాత్రమే జరిగే వేడుక కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.