AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Bhuvaneswari: పార్టీ కార్యకర్త బిడ్డకు నామకరణం చేసిన భువనేశ్వరి.. ఏ పేరు అంటే..?

చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో ఆమె పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది.

Nara Bhuvaneswari: పార్టీ కార్యకర్త బిడ్డకు నామకరణం చేసిన భువనేశ్వరి.. ఏ పేరు అంటే..?
Nara Bhuvaneswari
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2024 | 12:55 PM

Share

 నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. సింగనమల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త హేమంత్ యాదవ్, శోభాయాదవ్ దంపతులు భువనేశ్వరిని కలిశారు. తమకు జన్మించిన మగ పిల్లాడికి పేరు పెట్టాలని వారు భువనేశ్వరిని కోరారు. దీంతో కుశల్ కృష్ణ అని ఆ బాలుడికి భువనేశ్వరి నామకరణం చేశారు. తమ బిడ్డకు భువనేశ్వరి నామకరణం చేయడం పట్ల  హేమంత్ యాదవ్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం 4:10 గంటలకు పుట్టపర్తి, శ్రీ సత్యసాయి విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు భువనేశ్వరి తిరుగు పయనం కానున్నారు.

నిజం గెలవాలి పేరుతో పరామర్శ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు వార్త విని కన్నుమూసిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఓవైపు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూనే.. స్థానిక నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు అటెండ్ అవుతున్నారు. బిడ్డల్లాంటి కార్యకర్తలను ఆదుకోవడం తన కర్తవ్యమన్నారు. చంద్రబాబు ప్రజల మనిషి అని, ఆయన ధ్యాస అంతా ప్రజలు, కార్యకర్తల గురించేనని అన్నారు. తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు అండగా నిలబడి చూపిన అభిమానం ఎప్పుడూ మరువలేనిదన్నారు.

ప్రతీ జిల్లాను ఒక పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు శ్రమించారని భువనేశ్వరి గుర్తు చేశారు. కాని, ప్రస్తుతం రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు చేయడం, కేసులు పెట్టడంలో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు నెంబర్‌ వన్‌గా మారిపోయిందని భువనేశ్వరి అన్నారు. చంద్రబాబుపై ప్రజలకున్న అభిమానం చూసి తాను చాలా గర్వపడుతున్నానని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు